Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

E-Nommination in epf account : ఈపీఎఫ్ లో ఈ-నామినేషన్ తప్పనిసరి అంట.. లేదంటే!

E-Nommination in epf account : ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్ కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే కచ్చితంగా ఇప్పుడు జత చేయాలని ఈపీఓ సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మన ఈపీఎఫ్ అకౌంట్ లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.

E-Nommination in epf account

ఈపీఎఫ్ లో ఈ-నామినేషన్ ఫైల్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ వైబ్ సైట్ కి లాగిన్ అవ్వాలి. మ్యానేజ్ బటన్ పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి. అండర్ ఫ్యామిలీ డిక్లరేషన్ ఎస్ అనే ఆప్షన్ పై ఎస్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. తర్వాత మీ నామిని డీటెయిల్స్ యాడ్ చేయాలి. నామినితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను ఎంటర్ చేయండి. నామిని డీటెయిల్స్ నామిని ఆధార్ కార్డు నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్, అడ్రస్, ఐఎఫ్ఎస్ఈ కోడ్, నామిని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత యాడ్ రో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇతర నామిని సభ్యుల వివరాల్ని ఎంటర్ చేయవచ్చు. తర్వాత నామినికి ఎంత షేర్ ఇవ్వాలనుుకుంటున్నారో ( ఉదాహరణకు 100 శాతం) ఎంటర్ చేయండి. ఒఖ వేళ నామినీలు ఒకరి కంటే ఎక్కువ పర్సెంటేజీలు వారిగా యాడ్ చేయండి. వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీటు ఎంటర్ ేసిన వివరాలు సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ తో లింక్ అయిన ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారుడు మరణిస్తే అతను/ఆమె అకౌంట్ లో ఉన్న మొత్తం నామిని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అదే ఖాతాదారుడు మరణిస్తే పీఎఫ్ తో పాటు 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది.

Advertisement

Police Notification: వయో పరిమితి పెంపు పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. ఆగస్టులోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్!

Exit mobile version