Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Heavy Temperature : మండుతున్న ఎండలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Heavy Temperature : ఉదయం నుంచే సూర్యుడు రాష్ట్రంలో నిప్పులు కురిపిస్తున్నాడు. అడుగు బయట వేసేందుకు ప్రజలు జంకుతున్నారు. నిప్పుల కొలమిలో అడుగు వేయాలా అన్నంతంగా ఆలోచిస్తూ.. బయటకే రావట్లేదు. వచ్చిన వాళ్లు కూడా ఎండ వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ జ్యూస్ లు, కొబ్బరి బోండాలు, కూల్ డ్రింకులు తాగుతూ… భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరీ అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు.

Heavy Temperature

అయితే తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, జయశంకర్ భూపాల పల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లా నార్త్ లో, హన్మకొండ జిల్లాలోని శ్యాంపేటలో, జయశంకర్ భూపాల పల్లి జిల్లా రేగొండలో , నిజామాబాద్ జిల్లా మక్లూర్ లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.

Read Also : Temperature in Telangana : ఓవైపు చల్లదనం, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రత.. ఎక్కడెంత?

Advertisement
Exit mobile version