Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి లో గుప్పెడంత మనసు భామలు.. ఎందుకొచ్చారో తెలుసా?

Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో గుప్పెడంత మనసు సీరియల్ నటీమణులు వసుధార, సాక్షిలు కనిపించబోతున్నారు. కనిపించడమే కాదండోయ్ రిషి నావాడు అంటే నావాడు అంటూ పంచాయత కూడా పెట్టుకున్నారు. ఆ తగువును తులసి తీర్చబోతుండటంతో నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.అయితే ఈ ముగ్గురి ముచ్చట ఎలా సాగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లు ఈ సీరియల్ లో ఎందుకు కనిపించారో కూడా చూద్దాం.

Intinti gruhalakshmi

Intinti gruhalakshmi : తులసి తో వసుధార..రిషి సార్ నాకే దక్కాలి..

తులసి బోనం ఎత్తే కార్యక్రమానికి సిద్ధమవుతుండగా… వసు, సాక్షి వచ్చి తులసి పక్కన కూర్చుంటారు. ఒకరినొకరు ఈర్ష్యగా చూస్కుంటారు. రిషి సార్ దక్కాలని మొక్కుకుంటూ బోనం ఎత్తుదాం అనుకున్నా.. ఈ విషయం సాక్షికి ఎలా తెలిసింది, నా వెనకానే తయారైంది అనుకుంటుంది వసుధార. సేమ్ ఇలాగే సాక్షి కూడా అనుకుంటుంది. వీరద్దరినీ గమనించిన తులసి వారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూస్కుంటున్నారే తప్ప బోనాలు రెడీ చేయడం లేదేటీ… ఇదే మొదటి సారా అని తులసి అడగ్గా.. అవునని చెప్తారు. దీతో తులసి వారిద్దరికీ.. బోనం ఎలా తయారు చేయాలో చెప్తుంది. వసు, రిషిల జటను అభిమానించే వారికి ఇది గుడ్ న్యూసే.

Read Also :  Intinti Gruhalakshmi july 11 Today Episode: పాటల పోటీలో గెలిచిన ప్రేమ్.. తులసీని గెలిచింది అని ఒప్పుకున్న నందు..?

Advertisement
Exit mobile version