Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha manasu : లైబ్రరీ ఘటనపై జగతి రియాక్షన్‌ ఏంటి… రిషీ ఏం చెప్పాడు?

Guppedantha manasu : బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్‌ గుప్పెండత మనసు. తెలుగు లోగిళ్లలోని ప్రతి ఇంట వసూ, రిషిల పాత్రలకు ఎంతో క్రేజ్‌ పెరిగిపోతుంది. శుక్రవారం జరిగిన లైబ్రరీ ఎపిసోడ్‌ వీక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చూశాము. శని ఆదివారాలు వారాంతపు రోజులు అవ్వడం వల్ల ఈ డైలీసీరియల్‌కు రెండు రోజుల బ్రేక్‌ పడింది. మరి ఇవ్వాళ సీరియల్‌ ఎలా ఉంటుంది… జగతి, రిషీకి ఫోన్‌ చేసి ఏం మాట్లాడుతుంది. గౌతమ్‌ లెబ్రరీ విషయమై వసూ, రిషీలతో ఏం మాట్లాడుతాడన్నది 14 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో వసూ రిషీ లైబ్రరీలో ఇరుక్కుపోయిన సంగతిని గౌతమ్ జగతికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. దాంతో వసు దగ్గరకు జగతి వెళ్లి వసూని ‘రిషికి ఫోన్ కలిపి ఇవ్వమంటుంది. వసూ అలానే ఫోన్ చేసి జగతికి ఇస్తుంది. జగతి రిషితో.. ‘లైబ్రరీ మ్యాటర్ మాట్లాడాలి సార్’ అంటుంది. రిషి షాక్ అవుతాడు. ఒక గదిలో రిషి, వసూ ఉండటంపై జగతి చాలా కోపంగా ఉంటుంది దీనితో శుక్రవారం ఎపిసోడ్‌ ముగిసింది. ఇక సోమవారం ఎపిసోడ్‌లో ఇలా జరుగుతుంది.

Advertisement

జగతి రిషికి కాల్ చేసి సర్‌ థ్యాంక్స్‌ అని చెప్తుంది ఎందుకు మేడమ్‌ అంటాడు రిషీ. దానికి జగతి లైబ్రరీలో జరిగిన ఘటనకు థ్యాంక్స్‌ సర్‌ అని చెప్తుంది. తర్వాత ఫోన్‌ వసూకి ఇస్తుంది జగతి. రిషీ వసూతో అంటాడు నీకు ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో అస్సలు తెలియదా అందుకే నిన్ను హాస్టల్‌ జాయిన్‌ చెయ్యమన్నాను అని అంటాడు. దానికి ఖంగుతిన్న వసూ ఏంటి సర్‌ అంటుంది.. ఒక్కసారిగా ఆలోచిస్తూ హా ఏం లేదు అంటాడు రిషీ.

ఇంక తెల్లవారిన తర్వాత యధావిధిగా కాలేజి వెళ్తారు రిషీ, వసూ, జగతి, మహేంద్ర. రిషీ మరల ఒకసారి మిషన్‌ ఎడ్యూకేషన్‌ షార్ట్‌ఫిల్మం గురించి మాట్లాడడానికి అందరితో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు. షార్ట్‌ఫిల్మం అంతా అయిపోవడానికి వచ్చిందికదా అని రిషీ అడుగుతాడు. దానికి వసూ అవును సర్‌ అంటుంది. ఓకే ఇక అందరూ వెళ్లిపోండి అంటారు. జగతిని మాత్రం మేడం మీరు ఆగండి అంటారు. మహేంద్ర వసూ బయటకి వచ్చి సర్‌ రిషి సార్‌ జగతి మేడంని ఎందుకు ఆగమని చెప్పారంటారు అని మహేంద్రని అడుతుంది.

ఇంక గౌతమ్‌కి అస్సలు వసూ, రిషి లైబ్రరీలో ఎలా ఇరుక్కుపోయారా… అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. కానీ రిషీ అదంతా లైబ్రరేరియన్‌ చూసుకోకుండా లాక్‌ చెయ్యడం వల్ల జరిగింది అని సింపుల్‌గా చెప్తాడు. ఇలాకాదు అని గౌతమ్‌ వసూ నుంచి కూపీలాగే ప్రయత్నం చెయ్యగా వసూ చెప్తుంటే రిషీ వసూని గిచ్చి అదో ఫోబియా అప్పుడప్పుడే అలా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈ సన్నివేషం వీక్షకులను ఎంతగానో నవ్వు తెప్పింస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌ కొనసాగుతుంది.

Advertisement
Exit mobile version