Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu Aug 1 Today Episode : రిషి మౌనంగా ఉండటంపై ఆందోళనలో వసుధార.. రిషిని ట్రాప్ చేసేందుకు మరో ప్లాన్ వేస్తున్న సాక్షి, దేవియాని..!

Guppedantha Manasu Aug 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సాక్షి రెస్టారెంటులో వసుధారను విసిగిస్తుంటుంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అడగవా అంటూ సాక్షి వసుధారను విసిగిస్తుంది. అయినా నీకు తెలుసు కదా. డిబిఎస్‌టీ కాలేజీ ఎండీ ది గ్రేట్ మహేంద్ర భూషణ్ కుమారుడు రిషి అలాంటి గొప్ప వ్యక్తి నాకు కాబోయే భర్త అని చెప్పడం ఎంత బాగుంటుందో తెలుసా?  ఆ ఫీలింగ్ నీకు అర్థం కాదులే.. ఎందుకంటే అలా చెప్పే సిచువేషన్ నీకు రాదు కదా.. ఏం మాట్లాడవేంటి వసుధారా..

నీ మనస్సులో అగ్ని పర్వతాలు బద్దలు అవుతున్నాయని నాకు తెలుసు.. నా మీద పీకల్దాకా కోపం వచ్చి ఉంటుంది కదా.. నన్ను చంపేయాలని అనిపిస్తుంది కదా.. ఓటమి అంటే ఎలా ఉంటుందో ఈసారి చాలా రుచి చూసావు కదా.. ఈ రోజు బిల్లు నేనే కడతాను.. ఏం తింటావో తిను.. కాఫీ తాగు అని గతంలో ఏదో అన్నావు కదా.. ఈ రోజు నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను.. బిల్లు మొత్తం నేనే కడతాను.. రెస్టారెంట్ లో ఏం ఉన్నాయో అన్ని ఆర్డర్ చేయి.. మనం పార్టీ చేసుకుందాం.. ఇంకా ఏం మాట్లాడితే.. ఈ రోజు రెస్టారెంటుకు వచ్చేవారిందరికి నేనే బిల్లు కడతా.. గేమ్ ఓవర్ వసుధార.. ఆట ముగిసింది.. సాక్షి తానే గెలిచానని అంటుంది.

Guppedantha Manasu Aug 1 Today Episode

అప్పటివరకూ సైలంట్ గా కూర్చొన్న వసుధార.. కంగ్రాట్స్ సాక్షి అంటూ పైకి లేస్తుంది. ఏంటి.. ఆట ముగిసింది.. నేనే గెలిచానని ఏదేదో అంటున్నావు.. ఆట ముగిసిందని నువ్వెలా చెబుతావు సాక్షి.. దొంగాట మొదలుపెట్టావు.. ఆట ఎప్పుడూ ముగిస్తుందో తెలుసా? నా గెలుపు నువ్వు కల్లారా చూసినప్పుడు.. మా ప్రేమ గెలిచినప్పుడు.. అంతేకానీ.. మోసం చేసినప్పుడు కాదు సాక్షి.. ఆట ముగిసేదిని వసుధార అంటుంది. ఏంటి.. ఇంకా నీకు నమ్మకం ఉందాని సాక్షి అంటే.. నమ్మకం కాదు సాక్షిని వసు అంటుంది. రిషిపై నువ్వు గెలవగలవని ఎలా అనుకుంటున్నావు.. రిషి సార్ ముందు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ప్లాన్లులు వేసినా వర్కౌట్ కావు.. అన్ని రకాలుగా ప్రయత్నించావు.. అన్నిసార్లు ఫెయిల్ అయ్యావు.. రిషి సార్ సైలంట్ గా ఉన్నంత మాత్రానా.. నువ్వు సక్సెస్ అయ్యావని ఎందుకు అనుకుంటావు.. నువ్వు ఎప్పటికటీ రిషి సార్ ని గెలవలేవు.. నువ్వు గెలవలేవు.. రిషి సార్ మనస్సును గెలవలేవు.. గెలిచిందేంటో నాకు తెలుసునని వసుధార అంటుంది.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

వసుధార.. నువ్వు ఎలా ఉన్నావో.. కన్నీళ్లు పెట్టుకుంటూ గుండె ముక్కలై బాధపడుతుంటావేమనని ఒక్కసారి ఓదార్చి పోదామని వచ్చానని సాక్షి అంటుంది. సరే.. నేను వెళ్లనా.. నాకు చాలా పనులు ఉన్నాయి కదా.. రిషితో లాంగ్ డ్రైవ్‌లు, చాటింగ్‌లు, పెళ్లి అన్నాక చాలా పనులు ఉంటాయి కదా అంటుంది సాక్షి. నువ్వు రిషిని కావాలనుకున్నావో.. అతడి ఆస్తిని కావాలనుకున్నావో నాకు తెలియదు కానీ.. జీవితం అన్నాక.. అనుకున్నవి జరుగవు కదా అని అంటుంది సాక్షి.. రిషిని నేను గెలుచుకున్నాను.. నువ్వు ఎలాగో క్లవర్ స్టూడెంట్ కాబట్టి మంచి ఉద్యోగం సంపాదించి నీకు దొరికిన వాడిని పెళ్లి చేసుకుని జ్ఞాపకాలను తలుచుకుంటూ శేష జీవితం గడిపేయ్ అంటూ సాక్షి చెబుతుంది. నీ హెల్త్ జాగ్రత్త వసూ.. టైంకు తిను అంటూ సాక్షి చెప్పి వెళ్తుంది.

Guppedantha Manasu Aug 1 Today Episode

రిషి కార్లో వెళ్తుండగా సాక్షి ఏంటి ఇలా చేసిందంటూ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. తన పక్క సీటులో వసుధార కూర్చుని ఉన్నట్టుగా ఫీలవుతాడు. తాను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి నాకే ఎందుకు ఇచ్చిందా అని ఆలోచనలో పడతాడు. వసుధారా గిఫ్టు ఇచ్చి నాకేం చెప్పాలనుకుంటోంది.. ఆ గిఫ్ట్ ఇవ్వబోతుండగా.. గిఫ్ట్ నేను వదిలేసి వెళ్లిపోయానంటి.. నాకు నేనే అర్థం కావడం లేదంటూ అనుకుంటాడు రిషి. నువు గిఫ్ట్ ఇచ్చే సమయానికి నేను తీసుకునే పరిస్థితిలో లేను వసుధారా.. అసలు నువ్వు గిఫ్ట్ ద్వారా నాకేం చెప్పాలనుకున్నావో ఏమో.. నాకు తెలియడం లేదంటున్నాడు. మనిద్దరం కలిసి ప్రయాణం చేస్తాం.. ఎప్పుడూ నేనొక‌లా ఆలోచిస్తాను.. నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు.. అసలేం జరుగుతుందో నాకు అర్ధం కావట్లేదని రిషి ఆలోచిస్తుంటాడు.

Guppedantha Manasu Aug 1 Today Episode : రిషికి వసుధార ప్రేమిస్తుందని చెప్పేసిన జగతి.. రిషి ఏం చేయబోతున్నాడు?

Guppedantha Manasu Aug 1 Today Episode

సీన్ కట్ చేస్తే.. మహీంద్ర, జగతి, గౌతమ్ ఒకేచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.. సాక్షి చేసిన పనికి మనం ఏం చేయాలని అనుకుంటారు. అప్పుడు వసుధారాను పిలిచి మహీంద్రా ఏం మాట్లాడవే అని అడుగుతాడు. సాక్షికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అంటాడు మహీంద్రా.. వెంటనే సాక్షి వెనక ఉన్న ధైర్యం ఎవ్వరూ నీకు తెలియదా మహేంద్ర అని జగతి అంటుంది. ఇదంతా కాదు.. రిషి మనసులో అసలు ఎవరు ఉన్నారో తెలియాలి. రిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకోవాలని జగతి అంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది.. రిషి ఏం మాట్లాడలేదు కదా.. అదే నా సమస్య అంటాడు మహీంద్రా.. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. కాఫీ ప్లీజ్ అంటాడు. అందరూ ఏదో విషయంపై మాట్లాడుతున్నారు అంటాడు రిషి. తాను మాత్రం కాఫీ తాగడానికి వచ్చానని రిషి చెప్తాడు.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Guppedantha Manasu Aug 1 Today Episode

గౌతమ్ లేచి ఏంట్రా కాఫీ తాగే టైమ్ ఇదా కోపగించుకుంటాడు. రెస్టారెంట్లో చర్చలు పెట్టొద్దు.. నేను డిస్కషన్ కోసం రాలేదు.. కాఫీ కోసం వచ్చానని అంటాడు. దయచేసి ఎవరూ ఏం మాట్లాడొద్దు అని రిషి అంటాడు. వసుధారను కాఫీ తెమ్మని చెబుతాడు. జగతిని కూడా ఆర్డర్ అడుగుతుంది వసుధార.. గౌతమ్ ఎంత కూల్‌గా ఎలా ఉన్నావురా అని రిషి అడుగుతాడు. నేను ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో బాగా తెలుసు అంటాడు. ఎవరూ టెన్షన్ పడొద్దని అని రిషి చెప్తాడు.

వసుదారని ముందు కాఫీ తెమ్మని చెబుతాడు. వెంటనే వసుధార మరో అమ్మాయిని పిలిచి వాళ్లకేం కావాలో చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా.. దేవియాని, సాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ ప్లాన్ ఏంటి అని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. రిషిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. తాను ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాడు.. తన మెంటాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టమని దేవయాని అంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని దేవయాని సాక్షితో చెబుతుంది.

Guppedantha Manasu Aug 1 Today Episode

మరో విషయం గుర్తుపెట్టుకో.. రిషి దగ్గర హక్కుతో మాట్లాడకూడదని అంటుంది. తన మనసు గెలుచుకునేలా మాట్లాడాలని సాక్షితో దేవయాని చెబుతుంది. ఆ తర్వాత వసుధార అమ్మవారు దగ్గరకు వెళ్లి తనకు తానుగా మాట్లాడుకుంటూ ఉంటుంది. తన బాధను అమ్మవారితో చెప్పుకుంటుంది. రిషి సార్ చుట్టూ సాక్షి పన్నాగాన్ని ఎలా తిప్పికొట్టాలో నాకేం అర్థం కావట్లేదు అమ్మ అంటుంది. పగిలిపోయిన బొమ్మని అతికించి బంధం కూడా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నానని వసుధార అంటుంది. రిషి సారు చాలా ప్రమాదంలో ఉన్నాడని నాకు అర్థమవుతుందని, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు.. ఈ బంధం ఎలా నిలబెట్టుకోవాలో తెలియడం లేదని జరిగిన సంఘటనలను వసుధార గుర్తు చేసుకుంటుంది. రిషి సార్ ఎలాగైనా సరే సంతోషంగా ఉండాలని వసుధార అమ్మవారికి దండం పెట్టుకుంటుది. అదే సమయంలో రిషి కూడా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

రిషి దగ్గరికి జగతి మాట్లాడటానికి వస్తుంది.. మీరేం ఆలోచించవద్దని అంటుంది జగతి. జరిగినవన్నీ చూస్తూనే ఉన్నాను.. కానీ ఏం చేయలేక పోతున్నానని రిషి బాధపడుతూ చెబుతాడు. ఎవరికి నచ్చినవి వారు చేస్తున్నారని అంటాడు. అప్పుడు జగతి.. రిషి నేను జెప్పేది ఒక్కసారి వినమని అంటుంది. జీవితంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి.. అవన్నీ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్లాలని చెబుతుంది జగతి. ఇకపోతే వసుధార గురించి మీరు ఏం చెప్పొద్దన్నారు.. కానీ ఒక విషయం చెప్పాలి సార్ అంటుంది. వసు తన విషయంలోనూ మీ విషయంలోనూ చాలా స్పష్టంగా ఉందని అంటుంది. తాను మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ అని రిషితో జగతి చెబుతుంది. అంతే.. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ అవుతుంది. ఇక వసుధార తనను ప్రేమిస్తుందని తెలిసిన రిషి.. ఏం చేయనున్నాడో తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే..

Read Also : Guppedantha Manasu July 30 Tody Episode : రిషికి తన మనసులో ప్రేమను చెప్పబోయిన వసుధార.. రిషిని బ్లాక్ మెయిల్ చేస్తున్న సాక్షి..!

Advertisement
Exit mobile version