Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Group 1: అభ్యర్థులకు శుభవార్త.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడగింపు!

Group 1: గ్రూప్-1 కోసం అభ్యర్థుల దరఖాస్తులకు గడువును పొడగించారు. ఈ నెల 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. మంగళ వారం అఱధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు విధించిన నేపథ్యంలో… చివరి రోజు 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. కానీ దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్ లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది.

Group 1 applications deadline extended

ఒకే రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, ఫీజు చెల్లింపుతో పాటు వివిధ రకాల సమస్యలను అభ్యర్థులు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకువచ్చారు. మంగళ వారం రాత్రి పదకొండు గంటల వరకు 3 లక్షల 48 వేల దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా లక్షా 84 వేల 426 ఓటీఆర్ లు వచ్చాయి. అభ్యర్థుల ఇబ్బందులు, గడువు పొడగించాలని వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని టీఎస్పీఎస్సీ ఈనెల 4వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు పొడగించింది

Read Also :TSPSC Group-1: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

Advertisement
Exit mobile version