Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki kalaganaledu : జానకి పై పొగడ్తల వర్షం.. కుళ్లుకుంటున్న మల్లిక..?

Janaki Kalaganaledu Aug 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లీలావతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వెన్నెల తనదైన శైలిలో సమాధానం ఇచ్చి లీలావతి నోరు మూయిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు, మల్లికను అమ్మవారి విగ్రహాన్ని జానకికి ఇవ్వమని చెబుతాడు. ఆ తర్వాత జానకి ఆ విగ్రహాన్ని తీసుకొని పూజ చేసి దీపం పెడుతుంది. ఇందులోనే పూజారి పెద్దకొడుకు పెద్ద కోడల్ని పీటల మీద కూర్చోమని చెబుతాడు. అప్పుడు జ్ఞానాంబ ఈసారి చిన్న కోడలు చిన్న కొడుకు పూజ చేస్తారు అని అనగా వెంటనే పూజారి ఆచారం ప్రకారం పెద్దవాళ్ళు కూర్చోవాలి అని అంటాడు.

Govindaraju tries to convince Jnanamba to forgive Rama Chandra and Janaki in todays janaki kalaganaledu serial episode

వెంటనే మల్లిక ఆచారాలు మన నుంచి పుట్టుకొచ్చాయి పైనుంచి ఊడిపడలేదు అని విష్ణుని బలవంతంగా పీఠల మీద కూర్చోబెడుతుంది. అప్పుడు పూజారి మల్లికని కంకణం కట్టుకోమని చెప్పగా వెంటనే మల్లికా పోయిన సంవత్సరమే కట్టుకున్నాను అని అనగా వెంటనే గోవిందరాజు ఇది తోటి కోడలు మీద కట్టాల్సిన కంకణం కాదమ్మా అంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత జానకి రామచంద్ర కి కంకణం కడుతుంది.

అప్పుడు పూజారి మల్లిక అమ్మవారికి ఏదైనా మంగళ స్తోత్రం సమర్పించండి అని చెప్పగా వెంటనే మల్లిక టెన్షన్ పడుతూ ఉండగా వెంటనే గోవిందరాజులు మళ్లీ కని వెటకారంగా మాట్లాడిస్తూ జానకిని పాట పాడమని చెబుతాడు. అప్పుడు జానకి పాట పాడడంతో మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న వారందరూ జానకిని పొగుడుతూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత పూజారి పూజ పూర్తి అయ్యింది అని చెప్పి వాయినాలు అందరికీ ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోమని చెబుతాడు. అప్పుడు మల్లికా అందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. అప్పుడు గోవిందరాజులు జానకిని మిగిలిన వాళ్ళకి వాయినాలు ఇవ్వమని చెబుతాడు. ఆ తరువాత ముత్యజీవి లందరూ వెళ్లిపోగా జానకి జ్ఞానంభకు వాయినం ఇద్దామని చూడడంతో అక్కడ జ్ఞానాంబ ఉండదు.

ఆ తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ నీ ఏమి ఇక్కడ ఉన్న జ్ఞానం అని అడగగా వెంటనే జ్ఞానాంబ ఈ పూజలో నా అవసరం బాధ్యత అంతా అయిపోయింది అని అంటుంది. అప్పుడు గోవిందరాజులు నీకు బాధ్యత ఇంకా అయిపోలేదు జానకి వాళ్ళ వాయనం కూడా తీసుకొని వాళ్లని ఆశీర్వదించు అని చెబుతాడు.
అప్పుడు వారి ముఖం చూస్తున్నప్పుడు నాకు వాళ్ళు చేసిన మోసం గుర్తుకు వస్తుంది అని అనడంతో వెంటనే గోవిందరాజులు చిన్న తప్పు చేశారు అని చెప్పి ఆ పేగు బంధాన్ని నువ్వు వదిలించుకుంటావని జ్ఞానాంబ ని అడగగా జ్ఞానాంబ ఆలోచనలలో పడుతుంది.

Read Also : Janaki Kalaganaledu july 18 Today Episode : అందరి ముందు సరసాలు ఆడుతున్న జానకి, రామచంద్ర.. కుళ్లుకుంటున్న మల్లిక..?

Advertisement
Exit mobile version