Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

AP News: ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై తప్పిన కరెంటు తిప్పలు… నిరంతరం కరెంటు సదుపాయం!

AP News: అసలే ఎండల కాలం ఒక వైపు భానుడు ఉగ్రరూపం, మరోవైపు కరెంటు కోతలు విధించడంతో ఆంధ్ర ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. డిమాండ్ కి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో వారంలో ఒక రోజు పవర్ హాలిడే దినంగా ప్రకటించారు. దీంతో కరెంటు కోతలు అధికమవడం వల్ల అధిక ఉక్కపోత కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇలా ఉక్కపోతతో సతమతమయ్యే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.

ఇకపై కరెంటు కోతలు ఉండవని నిరంతరం కరెంటు సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే కాకుండా పరిశ్రమలకు కూడా నిరంతరం కరెంటు సదుపాయం ఇవ్వనున్నట్లు ఏపీ సర్కార్ తెలియజేశారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కావలసినంత బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం కరెంటు కోతలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు.

ఒకవైపు బొగ్గు నిల్వలు పెరగడమేకాకుండా, కేరళ కర్ణాటక రాష్ట్రాలలో వర్షాలు కురవడం వల్ల మన రాష్ట్రంలో జలాశయాలకు నీటి సామర్థ్యం పెరిగింది.
మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లోకి తగినంత స్థాయిలో నీటి సదుపాయం ఉండటంవల్ల విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కరెంటు కోతలను ఎత్తివేశారు.ఇకపై అన్ని రంగాలకు 100% విద్యుత్ సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

Advertisement
Exit mobile version