YS Vivekananda Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019లో దారుణంగా హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హత్యకు గల కారణాలు దోషులు గురించి సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతూ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో జగన్ తనకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అతనికి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఈ కేసులో తప్పనిసరిగా దోషులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ తనతో చెప్పినట్లు వెల్లడించారు.ఇక కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణకు కావాల్సిన అన్ని వివరాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తనకు చెప్పినట్లు వెల్లడించారు.ఈ కేసు విషయంలో తప్పనిసరిగా దోషులకు శిక్ష పడాలని సీఎం తన అభిప్రాయాన్ని వెల్లడించారనిఈ సందర్భంగా మాజీ డిజిపి వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని తాను వివేకా కూతురు సునీత భర్త రాజశేఖరరెడ్డి తనని కలిసినప్పుడు ఇదే విషయం వారికి వెల్లడించాలని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ వివేకా హత్య కేసు గురించి తెలియజేశారు.