Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Technology News : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 75 వేల స్మార్ట్ టీవీ రూ. 28, 999లకే.. డోంట్ మిస్..!

Vu Premium Smart TV

Vu Premium Smart TV

Technology News : ప్ర‌ముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkar Sale) ఎల‌క్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంట్లోనే థియేటర్ ఫీల్‌తో సినిమాలు చూసేందుకు పెద్ద డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా… అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే. 55 ఇంచుల 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం అదిరే ఆఫర్‌ అందిస్తుంది ఫ్లిప్ కార్ట్.

ఏకంగా 55 ఇంచుల డిస్‌ప్లే ఉన్న టీవీ ఉంటే ఒకరకంగా ఇళ్లే థియేటర్‌లా మారిపోతుంది. సినిమాలు థియేటర్‌లో చూసినట్టే ఫీల్ అవొచ్చు. సాధారణంగా పెద్ద డిస్‌ప్లే ఉండే టీవీల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ ఆఫర్‌ ఆకట్టుకునేలా ఉంది. రూ.75,000 విలువ చేసే 55 ఇంచుల స్మార్ట్‌ టీవీని రూ.28,999 సొంతం చేసుకునే ఆఫర్‌ వచ్చింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అవును… మీరు చదువుతుంది నిజమే. Vu Premium 139 cm (55 Inch) Ultra HD (4K) LED Android Smart TV (55PM) టీవీపై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌ ఉంది. సాధారణంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.75,000 కాగా… ప్రస్తుతం బిగ్ బచట్ ధమాల్ సేల్‌లో భాగంగా రూ.39,999 లకే ఇది అందుబాటు లోకి ఉంది. అలాగే పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూ. 11,000 ఆఫర్‌ పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.28,999కే ఈ వీయూ 55 ఇంచుల స్మార్ట్ ఎల్ఈడీ టీవీని దక్కించుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరో వైపు నెలకు రూ. 1,368 ఈఎంఐ తోనూ ఈ స్మార్ట్ టీవీని కొనవచ్చు.

Advertisement
flip-cart-announces-interesting-discount-on-vu-55-inch-4k-tv

3840 x 2160 పిక్సెల్స్ అల్ట్రా హెచ్‌డీ (4K) రెజల్యూషన్‌తో కూడిన 55 ఇంచుల డిస్‌ప్లేతో ఈ వీయూ స్మార్ట్ టీవీ వస్తోంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10 హెచ్‌జీఎల్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ ఈ టీవీలో ఉంది. అలాగే 16 జీబీ స్టోరేజీ ఉంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ టీవీ నడుస్తుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్, ఇన్‌బుల్ట్ క్రోమ్‌కాస్ట్ ఉన్నాయి. 30వాట్ల స్పీకర్లు ఉన్నాయి. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ యాప్స్ ఈ టీవీలో ఉన్నాయి. మరోవైపు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్‌ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Health Tips : రాగి జావ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version