Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ennenno Janmala Bandam : నా భార్యను వేధిస్తావా అంటూ కైలాష్‌ను చితక్కొట్టిన యశోదర్.. సారీ చెప్పేవరకు ఇంట్లోకి రానన్న వేద..!

Ennenno Janmala Bandam July 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక గత ఎపిసోడ్‌లో భాగంగా వేద కైలాష్‌ని చెంప దెబ్బ కొట్టడానికి వస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. వేదా కైలాషుని కొట్టడానికి వచ్చినప్పుడు కంచు ఆపుతుంది. అప్పుడు కైలాష్ కుటుంబమంతా కలిసి నా మీద నింద వేస్తున్నారు. కానీ ఆ మెసేజ్లు మాత్రం తన ఫోన్ నుండే వచ్చాయన్న విషయం మీకు గుర్తు లేదు తనే నన్ను ప్రేమించమని వేడుకుంది. ఇలాంటి పనికిమాలిన మనిషిని మీరు నెత్తిన పెట్టుకున్నారు అంటాడు. అప్పుడు వేద హౌ డేర్ యు నిన్ను చంపేస్తా అంటూ గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. వెంటనే యశోదర్ నా భార్య ని అంత మాట అంటావా అంటూ కైలాషుని కొడతాడు. అప్పుడు వసంత్ పోలీసుల ను తీసుకొని వస్తాడు.

Ennenno Janmala Bandham Serial July 20 Today Episode

యశోదర్ కైలాష్ ని పోలీసులకి అప్పగించి వాడి అంత చూడండి ఇన్స్పెక్టర్ గారు సారిక సాక్ష్యం చెబుతుంది అంటాడు. అప్పుడు కంచు అందరూ కలిసి మోసం చేశారు అంటూ ఏడుస్తుంది అప్పుడు మాలిని కంచు ని తీసుకొని లోపలికి వెళుతుంది. సారిక వేద తో నన్ను క్షమించండి మేడం అంటుంది. అప్పుడు వేద నీ తప్పేమీ లేదు నాకు నీ గురించి అంతా తెలుసు కానీ ఇలాంటి మృగాలకు అవకాశం ఇవ్వకూడదు ధైర్యంగా ఎదిరించాలి అంటుంది. అప్పుడు రత్నం వేద వాళ్ళ నాన్నతో నన్ను క్షమించండి బావగారు ఇదంతా చూస్తూ నేను ఏమి చేయలేకపోయాను మౌనంగా ఉన్నాను అంటాడు. వేద వాళ్ల నాన్న ఒక ఆడపిల్ల తండ్రిగా నీ బాధ నాకు తెలుసు అంటాడు. అప్పుడు వేద మామయ్య గారు నేను మా ఇంటికి వెళుతున్నాను క్లినిక్ కి టైం అయింది అని చెప్పి వాళ్ళ నాన్న ను తీసుకొని ఇంటికి వెళుతుంది.

Ennenno Janmala Bandham Serial July 20 Today Episode

యశోదర్ శశిధర్ ని ఆపి ఒకప్పుడు వేద కి మీ తమ్ముడికి పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు కదా అలాగే నేను కూడా అంతే ఇప్పుడు కైలాష్ వల్ల నష్టపోయింది ఎవరో కాదు మా అక్క నే నాకు లెక్చర్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించావా లేదు కానీ నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను. వేద నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కదా మరి ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు. నేను నీకు న్యాయం చేయను అనుకున్నావా అసలు నాకు నిజం ఏమీ తెలియనప్పుడు నేను ఏం చేయాలి అంటాడు. మామయ్య గారు నీ కూతురికి న్యాయం జరిగింది కానీ మా అక్క జీవితం నాశనమైంది. నా ఇల్లు ముక్కలైంది నేను ఇంత చేసినా ఇంకా ఏమైనా మిగిలింది అనిపిస్తే ఐ యాం సారీ అంటాడు. ఇక నేను ఏమి చేయలేను వెళ్లాలి అనుకునేవాళ్ళు వెళ్లొచ్చు అంటాడు. అప్పుడు వేద అక్కడ నుండి వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది.

Advertisement

Ennenno Janmala Bandam July 20 Today Episode : భర్తగా యశ్ అడిగిన ప్రశ్నలకు భార్యగా వేద ఏం చెప్పబోతోంది..?

Ennenno Janmala Bandham Serial July 20 Today Episode

యశోదర్ తన మనసులో ఏంటి వేద నేను నీకోసం ఇంత చేసినా నన్ను వదిలి ఎలా వెళ్లిపోవాలని పించింది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద కూడా తన మనసులో నేను మీ నుండి ఆశించింది ఇది కాదండి మీరు అప్పుడే వేదం నువ్వు ఏం తప్పు చేయలేదు అని అందరి ముందు చెప్పాల్సింది అని అనుకుంటూ ఉంటుంది. అబద్ధం చెప్పడానికి నోరు చాలు కానీ నిజం నిరూపించడానికి సాక్ష్యం కావాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద కూడా అదే నాకు నచ్చలేదు అండి అని అనుకుంటూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లకు భర్తనే అండ దండ కానీ మీరు నాకు ఆ విషయంలో నిరాశ పరిచారు.

శరీరాని కి గాయం అయితే అదే మానుతుంది కానీ గుండెకు గాయం అయితే మానడానికి టైం పడుతుంది. అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు యశోదర్ కూడా నన్ను అర్థం చేసుకొని నువ్వే వస్తావు అనుకుంటూ ఉంటాడు. కంచు ఏడుస్తూ వాళ్ళ అమ్మతో నా భర్తను నాకు కాకుండా చేశారు. జైలు పాలు చేశారు. అసలు ఎవరమ్మా ఆ వేద నిన్నకాక మొన్న వచ్చి నా కాపురంలో చిచ్చు పోసింది. అయినా నీకు నీ కోడలి మీదనే నమ్మకం ఉంది కదా మేము అంతా అబద్ధం చెప్పే వాళ్ళం కదా నీకు నీ కూతురు కంటే కూడా కోడలే ఎక్కువ వెళ్ళు నీ కోడలు దగ్గరికి వెళ్ళు అంటుంది.

Ennenno Janmala Bandham Serial July 20 Today Episode

అప్పుడు మాలిని నువ్వు నా కూతురివి నీకు లోటు కానివ్వను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే కాంచన అమ్మ లైట్ తీసేయ్ నేను చీకట్లోనే ఉంటాను అంటుంది. రత్నం వేద కన్నీళ్ళు తుడిచి మనమే ఇంటికి తీసుకు రావాలి అంటాడు అప్పుడు యశోదర్ ఆ రోజు నేను వెళ్ళమని చెప్పలేదు. ఇప్పుడు రమ్మని కూడా చెప్పను అంటాడు. వేద వాళ్ళ అమ్మ బాధతో నా బిడ్డ శీలం మీద ఇంత మీద పడినప్పుడు కనీసం సారీ కూడా నోచుకోలేదు అంటుంది. అప్పుడు వసంత్ ఏది నిజమో ఏది అబద్దమో తెలిసేలా చేశావు వదిన మీద పడ్డ నిందను తుడిచే సావు. ఇంత చేసిన నువ్వు వదినను నచ్చచెప్పడానికి ఏమవుతుంది అంటాడు యశోదర్ తో. ఇక సులోచన వాళ్ళు వచ్చి నా బిడ్డ కాళ్ళ మీద పడేంత వరకూ నేను అక్కడికి పంపించను అంటుంది. ఇక యశోదర్ కూడా నేను వెళ్లి సారీ చెప్పే ప్రసక్తే లేదు అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం.

Advertisement

Read Also : Ennenno Janmala Bandham : వేద నిరపరాధి అని తేలినవేళ.. కైలాష్‌కి చెంపదెబ్బ..

Exit mobile version