Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam serial Oct 17 Today Episode : దుర్గ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడిన మోనిత..సంతోషంలో దీప..?

Karthika Deepam serial Oct 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లు దుర్గ,మోనిత ఇంటికి వచ్చి మోనిత తో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో దుర్గ ఏంటి బంగారం అనుకున్న పని జరగలేదు అని ఫీల్ అవుతున్నావా అని అనగా అది నిన్న దీప ని చంపడానికి మనుషుల్ని పంపించావు కదా అది ఫెయిల్ అయిందని టెన్షన్ పడుతున్నావా అని అంటాడు దుర్గ. అప్పుడు మోనిత ఏమి తెలియనట్లు ఏం మాట్లాడుతున్నావ్ రా అని అనడంతో నాకు తెలుసు బంగారం నువ్వు వాళ్ళతో మాట్లాడిన మాటలు వాళ్ళు ఎవరు అన్నది.

Durga and Deepa warn Mounitha in todays karthika deepam serial episode

నాకు బాగా తెలుసు రే పిచ్చిపిచ్చిగా వాగకు అని అనటంతో మరి దీప ను కాకపోతే కార్తీక్ సార్ ని చంపడానికి పెట్టావా అని అనడంతో మౌనిక షాక్ అవ్వగా పక్కనే ఉన్న కార్తీక్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు దుర్గ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మోనిత కార్తీక్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప ను చంపడానికి మనుషుల్ని పెట్టలేదు అన్నావు కదా మోనిత మరి ఇదేంటి అని అనడంతో కార్తీక్ వాడి మాటలు నమ్మకు వాడు అబద్ధాలు చెబుతున్నాడు అని అంటుంది.

నువ్వు తప్పు చేయనప్పుడు మరి ఆ దుర్గ కి ఎందుకు భయపడుతున్నావు అని అంటాడు కార్తీక్. మరొకవైపు దీప వాళ్ళ అన్నయ్యతో జరిగిన విషయాల గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్, సౌర్య కోసం వెతుకుతూ ఏంటి సౌర్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ రౌడీ నీకు ఈ గతి ఎందుకు పట్టింది అని బాధపడుతూ సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు. మరొకవైపు మోనిత ఇంట్లో దుర్గ కూర్చోవడంతో అక్కడికి వెళ్లి మోనిత, దుర్గ పై సీరియస్ అవుతుంది.

Advertisement

Karthika Deepam అక్టోబర్ 17 ఎపిసోడ్ : సౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్..దీప పరిస్థితి చూసి కార్తిక్ ఎమోషనల్..

అప్పుడు మోనిత ఏం కావాలి చెప్పు ఇంకా కావాలంటే నా ఆస్తి మొత్తం నాకు ఇస్తాను అంటూ దుర్గ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి దీప వచ్చి మోనిత ను చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప,దుర్గలతో మోనిత వాదిస్తూ ఉంటుంది. అప్పుడు దీప దుర్గా దీనికి ఇంకా పొగరు తగ్గలేదు చూసావు కదా ఇలా మాట్లాడుతుందో నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు దీనిపై కార్తీక్ బాబుకి మరింత అనుమానం వచ్చేలా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప.

ఆ తర్వాత దుర్గ కూడా వెళ్లిపోవడంతో ఏం చేయాలి అని మోనిత ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ శౌర్య కోసం వెతికి అలిసిపోయి దీప ఇంటికి వస్తాడు. అక్కడ దీప చిన్న గుడిసెలో పడుకొని ఉండగా కిటికీ లోంచి చూసిన కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. నన్ను ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నావు కాని అప్పటినుంచి నీకు కష్టాలు తప్పలేదు దీప అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప ని చూసి దీప పరిస్థితి తలుచుకొని గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతాడు కార్తిక్.

మరొకవైపు మోనిత, కార్తీక్ రాలేదు అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి శివ వస్తాడు. మీ సార్ కనిపించలేదు అని మోనిత అనగా కార్తీక్ సారా లేక దుర్గా సారా అనడంతో శివని కొడుతుంది మోనిత. దాంతో శివ మరి పక్క పక్కన పూసుకొని రాసుకొని తిరిగే సారి అనగా ఏమంటారు అని మనసులో అనుకుంటాడు. మీ సార్ బయటకు వెళ్ళాడు వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేసి లోపల పడుకోపెట్టి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది మోనిత. మరుసటి రోజు ఉదయం దీప లేచి చూసే సరికి బయట కార్తీక్ ఉండడం చూసి ఆశ్చర్య పోతుంది.

Advertisement

Read Also : Karthika Deepam serial Oct 15 Today Episode : మోనిత చెంప చెల్లుమనిపించిన దీప.. మోనితకు ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్..?

Exit mobile version