Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : పిల్లల భోజనం కోసం హోటల్‌లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్‌లో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తినిపించాల్సిన భోజనం కింద పడిపోవడంతో కార్తీక్ పిల్లలకు ఎలాగైనా భోజనం చేయించాలని తెగ తాపత్రయపడతాడు. ఇంట్లో డబ్బులు లేకపోయేసరికి ఓ హోటల్ కు వెళ్లి అక్కడ ఆ హోటల్ యజమానిని డబ్బులు సాయంత్రంలోగా తెచ్చి ఇస్తానని బ్రతిమాలి భోజనం అడుగుతాడు. కానీ అతడు కార్తీక్ మాటలను అస్సలు పట్టించుకోడు.

డబ్బు గురించి కార్తీక్ కు వివరిస్తాడు. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న మరో వ్యక్తి పని చేయడానికి మరో వ్యక్తి లేడని కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అక్కడ పని చేయాలని అనుకుంటాడు. వెంటనే ఆ యజమానిని అడిగి ఒప్పందం తీసుకొని పిల్లలకు భోజనం తీసుకొని వెళ్తాడు. ఇక పిల్లలు ఆకలి తట్టుకోలేక అక్కడ మంచినీళ్లు తాగుతుంటారు. కార్తీక్ పిల్లల పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటాడు. వెంటనే పిల్లలను ఓ చోట కూర్చోబెట్టి వారికి అన్నం తినిపిస్తాడు.

ఇక పిల్లలు కార్తీక్ పరిస్థితిని చూసి తన తండ్రికి కూడా భోజనం చేపిస్తారు. మరోవైపు దీప బాబు ని ఎత్తుకొని హోటల్ దగ్గరికి వెళుతుంది. ఇక ఆ హోటల్ యజమాని కి తాను చేసిన పిండివంటలను రుచి చూపించి తక్కువ ధరకే అమ్ముతానని అంటుంది.

Advertisement

Karthika Deepam : హోటల్‌ పనికి డాక్టర్ బాబు.. ఈ రోజు ఎపిసోడ్..

దాంతో అతడికి దీప చేసిన వంటలు నచ్చటంతో అతడు తన హోటల్ లోనే పని ఇప్పించాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని దీపకు చెప్పటంతో దీప సంతోషపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. కానీ ఇద్దరూ ఒకరికొకరు చూసుకోలేకపోతారు. ఇక ఇంటి దగ్గర హిమ, సౌర్య లను రుద్రాణి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.

అంతలోనే అక్కడికి దీప రావడంతో పిల్లలు దీప దగ్గరికి వెళ్లి పట్టుకుంటారు. వెంటనే దీప రుద్రాణి కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక సౌందర్య, ఆనందరావు వాళ్లు ప్రకృతి వైద్యశాల కు వెళ్లేందుకు లగేజీ తో బయలుదేరుతారు. శ్రావ్య, ఆదిత్య లకు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంట్లో నుంచి కారు దగ్గరికి వెళ్తారు. ఇక బయట కారులో ఉన్న మోనిత వీరిని చూసి ఆలోచనలో పడుతుంది. ఈ చీకట్లో వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని.. కార్తీక్ సమాచారం ఏమైనా తెలిసిందా అని అనుకుంటుంది. మొత్తానికి మోనిత కార్తీక్ ను దక్కించుకోవడం కోసం సౌందర్య కుటుంబాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది. బహుశా ఈసారి కూడా సౌందర్య వాళ్లను వెంటాడుతుందని అర్థమవుతుంది.

Read Also : Guppedantha Manasu : గౌతమ్ లవ్ లెటర్‌తో జగతి ముందు అడ్డంగా బుక్కయిన రిషి!

Advertisement
Exit mobile version