Instagram:ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ఫోన్ లేకుండా క్షణం గడప లేకపోతున్నారు ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు సైతం ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విటర్ వంటి వాటి గురించి తెలుస్తోంది ఈ క్రమంలోనే కొందరు అతి చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తరచూ ఇంస్టాగ్రామ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే మీ పిల్లలు కనకం ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉంటే ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వారు ఇంస్టాగ్రామ్ లో ఎంత సేపు ఉంటున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే విషయాల గురించి ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.
పేరెంటల్ సూపర్ విజన్ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు వాడే అకౌంట్‌కు ఈ ఫిచర్‌ను పంపాల్సి ఉంటుంది.ఆ రిక్వెస్ట్‌ను పిల్లలు అంగీకారం తెలిపితే తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించకపోతే ఫీచర్ వినియోగించడం కుదరదని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్ మన దేశంతో పాటు అన్ని దేశాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ ఫీచర్ మనదేశంలో పాటు అన్ని దేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలను పరోక్షంగా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు.
