Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha june 14 today episode : రుక్మిణి కోసం దీక్ష మొదలుపెట్టిన దేవుడమ్మ.. షాక్ లో మాధవ..?

Devatha june 14 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ, రుక్మిణి కోసం ఉపవాసం చేయడానికి సరే అని అంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో మాధవ,రాధ గదిలోకి వెళ్లి రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాధా అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏముంది అని రాధ రూమ్ మొత్తం వెతుకుతాడు. అప్పుడు మాధవ కు రాధ ఆదిత్య ల పెళ్లి ఫోటో దొరుకుతుంది. అప్పుడు మాధవ ఆ ఫోటోని చూస్తూ ఇది చూసుకొని నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావా రాధ అనుకుని ఆ ఫోటో వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.

Devatha june 14 today episode

ఇంతలోనే రాధ అక్కడికి వచ్చి ఈ గదిలో ఏం చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. అప్పుడు మాధవ, రాధా ఆదిత్య ఫోటోను చింపిన ఫోటోని చూపించడంతో రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి కోపం తో రగిలిపోతుంది. ఇంతలోనే పిల్లలు అక్కడికి రావడంతో వారిని తినిపించడానికి తీసుకొని వెళుతుంది.

Advertisement

అప్పుడు మాధవ మాత్రం ఆదిత్య ఫోటో వైపు చూస్తూ నువ్వే అడ్డు అని కోపంతో రగిలి పోతూ ఉంటాడు. ఆదిత్య ఇంటికి సంతోషంగా వచ్చి ఎలా అయిన నిజం చెప్పాలి అనుకుంటాడు. ఇంతలోనే దేవుడమ్మ దగ్గరికి ఒక భార్యాభర్తలు సలహా కోసం వస్తారు. అయితే వారి సమస్య అచ్చం ఆదిత్య సమస్య లాగే ఉండటంతో ఆదిత్య కూడా తన జీవితంలో కూడా అదే విధంగా జరుగుతుంది అనుకుంటాడు.

మరొక వైపు రాధా పిల్లలకు అన్నం తినిపించి ఆ తర్వాత కి లోపలికి వెళ్తుంది. మాధవ హాల్లో కూర్చుని రాధ పెళ్లి ఫోటో చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన రాధ వచ్చి మళ్ళీ మాధవ పై కోప్పడుతుంది. అప్పుడు రాధ తన నుదిటి పైన బొట్టు తన భర్త పెట్టింది అనడంతో మాధవ షాక్ అవుతాడు.

మళ్లీ ఆ ఫోటో ని తీసి అతికిస్తుంది రాద. మరొకవైపు దేవుడమ్మ, రుక్మిణి గురించి ఆలోచిస్తూ పూజారి చెప్పింది నిజమే అని రుక్మిణి కోసం ఉపవాస దీక్షను చేపడుతుంది. అప్పుడు సత్య మీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పినా కూడా వినకుండా నాకు నా కోడలు కావాలి అని దీక్షను మొదలుపెడుతుంది దేవుడమ్మ.

Advertisement

Read Also :  Devatha: మాధవ చేసిన పనికి షాక్ అయిన రాధ.. సంతోషంలో దేవుడమ్మ..?

Exit mobile version