Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Credit card: క్రెడిట్ కార్డులు ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచిదా.. కాదా!

Credit card: క్రెడిట్ కార్డుల ఉపయోగం వల్ల లాభాల ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజాన్ని కల్పిస్తాయి. చాలా మందికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలనే విషయంపై సందేహం ఉంటుంది. దీన్ని ఎలా నిర్ణయించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు మొదటి సారి క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మీకు క్రెడిక్ కార్డు హిస్టరీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆదాయం, ఖర్చుల ఆధారంగా ప్రత్యేకమైన లేదా ప్రమీయం క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత ఉండదు. అలాంటి సందర్భాల్లో మీరు ముందుగా మీ ఆదాయం, ఖర్చుల అవసరాల ఆధారంగా క్రెడిక్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ కార్డుని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. మంచి క్రెడిక్ స్కోర్ ను నిర్మించుకోవడానికి బిల్లును సకాలంలో చెల్లించాలి. అలా మరిన్ని ప్రయోజనాల కోసం ప్రీమియం క్రెడిక్ కార్డుకు అర్హత పొందవచ్చు.

Advertisement

గడువు తేదీలు చెక్ చేస్కోవాలి.. బహుళ క్రెడిట్ కార్డులు కల్గి ఉండటం వల్ల మీరు అధిక మొత్తం క్రెడిట్ పరిమితిని పొందవచ్చు. క్రెడిట్ కార్డుల్లో ఒకదానిపై పరిమితి అయిపోయినట్లయితే… మీరు మరొక క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు. బహుళ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నప్పుడు గడువు తేదీలతో పాటు డబ్బులు ఎందులో నుంచి ఎన్ని తీస్తున్నామన్నవి గుర్తుంచుకోవాలి.

బహుళ క్రెడిట్ కార్డుల ఎంపిక.. మీరు మీ ఆర్థిక అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఎంచుకోవచ్చు. ఖర్చు చేసేదాన్ని బట్టి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు. ఉదాహరణకు మీరు తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటే ఎయిర్ మైల్స్ క్రెడిట్ కార్డును పరిశీలించొచ్చు. అలా ట్రావెల్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్ని కార్డులు ఉంటే మంచిది.. కార్డుల సంఖ్య మీ ఖర్చు అలవాట్లు, మీ జీవన శైలి, ఎక్కువ కార్డులను నిర్వహించడంలో మీ సామర్థ్యం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Advertisement
Exit mobile version