Viral video: పాము పేరు వింటేనే చాలా మందితో భయంతో వణికిపోతారు. పాము అని అరిస్తే చాలు పదడుగుల దూరం వరకు పరిగెడతారు. చాలా మందికి భయపెట్టే జీవుల్లో పాము ముందు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ పామంటే భయమే. అందులోనూ నాగు పాము అంటే మరింత భయటపడతారు. అందుకు కారణం అది పూర్తిగా విషపూరితమైనది. అయితే ఇలాంటి ఓ పాము నడిరోడ్డుపై కనిపించిందో బాలుడికి.
అయితే అతడు ఆ పామును చూసి పారిపోలేదు. పడగ ఎత్తి కాటేయడానికి వస్తున్న దాన్ని చేతితో పట్టుకున్నాడు. అది చాసిన స్థానికులు వీడియో తీసి నెట్టింట పెట్టారు. అది కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోతో నెట్టిళ్లు షేక్ అవుతోంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. అలాంటి పామును ఆ బాలుడు పట్టుకోవడం చాలా గ్రేట్ అంటూ కొందరు కామెంట్లు చేయగా, అది నీకు అవరసమా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
కింగ్ కోబ్రా కుట్టిన వ్యక్తి 15 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు. ఒఖవేళ ప్రాణం నిలబడినా పక్షవాతం రావడం ఖాయం. మనుషులనే కాదు.. ఏనుగులను కూడా కింగ్ కోబ్రా తన కాటుతో చంపేయగలదు.