Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video: పాముపై పక్షి దాడి.. ఆ తర్వాత ఏమైందంటే..!!

Viral video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. చాలా వీడియోలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. వాటిని చూస్తే భలేగా అనిపిస్తుంది. ముఖ్యంగా వన్యప్రాణులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ ముచ్చట తెప్పిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా అలాంటిదే. అది చూస్తే కాస్త ఆశ్చర్యం, కాస్త భయం కలగపోదు. అసలు ఆ వీడియోలో ఏముంది అంటే..

పాము లాంటి విషపూరితమైన ప్రాణులతో ఎప్పటికీ ప్రమాదమే. పాముల్లో కొన్ని జాతుల్లో మాత్రమే విషం ఉంటుందని అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలిసిన మరో విషయం ఏమిటంటే… పాములు డేగలకు అస్సలే పడదు. పాములను చూస్తే డేగలు అస్సలు వదిలిపెట్టవు. ఇటీవల జరిగిన సంఘటన కూడా ఇందుకు సంబంధించినదే.

Advertisement

ఓ పాము రిలాక్స్ అవ్వడానికి బండపైకి వస్తుంది. దీనిని గమనించిన ఆకాశంలో ఉన్న డేగ… పామును వేటాడాలని అనుకుటుంది. అయితే డేగ పథకం ప్రకారం పాము కదలికలను గ్రహించి దాని వైపు దూసుకు వస్తుంది. ఆ తర్వాత పాము చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మందిని ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు చూసేయండి.

 

పాము తన బుద్ధిని ఉపయోగించిన దాడి చేస్తున్న పక్షిపై రివర్స్ అటాక్ చేస్తుంది. ఈ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు పాము పక్షి మెడను తలకిందులుగా పట్టుకోవడం మీరు చూడవచ్చు. అంతే కాకుండా పాము పక్షిని రాతిలోకి లాగడం ప్రారంభిస్తుంది. ఈ ఘటనలో పక్షి తన ప్రాణాలను ఎలాగోలా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement
Exit mobile version