Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg boss siri: స్టేజీపైనే సిరి, శ్రీహాన్ ల రొమాన్స్.. ఏంటమ్మా ఇదంటూ కామెంట్లు!

Bigg boss siri: బిగ్ బాస్ ఫేమ్ సిరి, శ్రీహాన్ ల ప్రేమ, ఎంగేజ్ మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో తర్వాత వారిద్దరూ విడిపోతున్నారంటూ చాలానే వార్తలు వ్చచాయి. కానీ అదేం లేదని.. మేము కలిసే ఉన్నామని చెప్తూ వారిద్దరూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కలిసున్న ఫొటోలను షేర్ చేశారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ చాలా చోట్లకు వెళ్లడం, ముఖ్యంగా తిరుపతికి వెళ్లడంతో… వీరు కలిసే ఉన్నారనే నమ్మకం వచ్చింది అందరికీ. అంతే కాదండోయ్.. సిరి కంటే కూడా శ్రీహాన్ కి.. ఆయన మాట తీరుకు మరింత గుర్తింపు వ్చచింది. అలాగే శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఉంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

తాజాగా వీరిద్దరూ కలిసి స్టార్ మా నిర్వహిస్తున్న మొగుడ్స్, పెళ్లామ్స్ అనే కార్యక్రమానికి వచ్చి సందడి చేసారు. అయితే ఈ ఈవెంట్ లో సీరియల్ తారలతో పాటుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా రచ్చ చేశారు. జానకి కలగనలేదు, గుప్పెడంత మనసు, గోరింటాకు టీం కూడా బాగానే రొమాన్స్ చేసింది. మరీ ముఖ్యంగా గుప్పెడంత మనసు వసు, రిషి ఇద్దరూ కూడా మగధీర స్టైలే లో ఫర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే సిరి, శ్రీహాన్ కూడా ఫుల్ కిక్కు అంటూ దుమ్ము లేపారు. మొదటి సారిగా ఇలా బుల్లితెరపై డ్యాన్స్ వేశారు. సిరి, శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. మీరూ ఓ సారి ఈ వీడియో చూడండి.

Advertisement

 

Advertisement
Exit mobile version