Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాము. ఇక పెళ్లి పత్రికల నుంచి మొదలుకొని పెళ్లి బట్టలు, నగలు, మండపం వరకు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఘనంగా ఉండేలా చూసుకుంటాము. ఇక పెళ్లి పత్రికల విషయానికి వస్తే సాధారణంగా కార్యనిర్వాహుల పేర్లు మన దగ్గర కుటుంబ సభ్యుల పేర్లను వేస్తాము. రెండు లేదా మూడు కుటుంబాల పేర్లను పెళ్లి పత్రికలో అచ్చు వేయడం మనం చూసాము. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 900 కుటుంబాల పేర్లను పెళ్లి పత్రికలలో వేయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ విధంగా రమేష్ అనే వ్యక్తితన కూతురు పెళ్లి కోసం తయారు చేయించిన ఈ బాహుబలి వెడ్డింగ్ కార్డు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.ఇక గ్రామస్తులు సైతం వారి పేర్లు పెళ్లి పత్రికలో ఉండటం వల్ల ఏకంగా తమ ఇంట్లో పెళ్లి జరుగుతుందని భావించి ఆ పెళ్లి పనుల తన భుజాన వేసుకుని ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. రమేష్ కుమార్తె వివాహం శుక్రవారం కుంభకోణంలో పదివేల మంది అతిథుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తానికి పెళ్లి పత్రికలు 900 కుటుంబాల పేర్లను వేయడంతో ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
