Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

AP Inter Exams Dates : ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లో ఎప్పుడంటే?

ap-inter-exams-date-ap-10th-and-inter-exams-date-schedule-released-today-check-dates-and-times

ap-inter-exams-date-ap-10th-and-inter-exams-date-schedule-released-today-check-dates-and-times

AP Inter Exams Dates : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు 10వ తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఇక మార్చిలో 11 నుంచి మార్చి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయని వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీ రాష్ట్రంలో మొత్తంగా 6,39,888 మంది విద్యార్థులు 10 తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Advertisement

10వ తరగతి షెడ్యూల్ (AP 10th Exams Date Schedule) :

మే 02 (సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (First Language)

మే 04 (బుధవారం ) : సెకండ్‌ లాంగ్వేజ్ (Second Language)

Advertisement

మే 05 (గురువారం) : ఇంగ్లీష్‌ (Enlish Language)

మే 07 (శనివారం) : గణితం (Maths)

మే 09 (సోమవారం) : ఫిజికల్ సైన్స్ (Physical Science)

Advertisement

మే 10 (మంగళవారం) : బయోలాజికల్ సైన్స్ (Biological Science)

మే 11 (బుధవారం) : సోషల్ స్టడీస్ (Social Studies)

మే 12 (గురువారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2 (కాంపోజిట్ కోర్స్‌/OSSCNEN లాంగ్వేజ్) పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)

Advertisement

మే 13(శుక్రవారం) OSSCNEN లాంగ్వేజ్ పేపర్‌ 2(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)/ SSC ఒకేషనల్‌ కోర్స్‌ థియరీ.

Read Also : Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

Advertisement
Exit mobile version