Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

AP CM Jagan: రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక భేటీ!

AP CM Jagan: కొత్త ఏడాదిలో కొత్త జిల్లాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ప్రారంభం అనంతరం ఢిల్లీ టూర్ కి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రేపు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడంతో కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు అందాల్సిన సాయం గురించి ఈ భేటీలో ప్రస్తావించనునట్లు సమాచారం.

కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న పలు కీలక అంశాలపై కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో ప్రస్తావించనునట్లు తెలుస్తోంది.ఈ విధంగా ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందుగా ఢిల్లీ పయనం కావడంతో ఈ భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బేటిలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్, పునర్విభజన చట్టంలో భాగంగా వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పై జగన్ ప్రస్తావించనునట్లు సమాచారం.

జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం ఢిల్లీ పయనం కావడంతో ఈ భేటీకి పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై మోడితో చర్చించనున్నట్లు సమాచారం. ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో పర్యటించడంతో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Exit mobile version