Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anupama : చూపుల బాణాలతో అనుపమ చిందులు.. కుర్రాళ్లను నిద్రపోనివ్వని కేరళ బ్యూటీ.. వీడియో వైరల్..!

Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral

Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral

Anupama : కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. కుర్రాళ్ల గుండెల్లో చూపులతో వలపు బాణాలను దింపుతోంది. కుర్రాళ్ల మతిపొగొట్టేస్తోంది. చిలిపి చేష్టలతో అనుపమ వేసే చిందులు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. తన ఇన్ స్టా అకౌంట్లో తాను డ్యాన్స్ వేసిన ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. ఇప్పుడా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన అందంతో అభినయంతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది.

అనుపమ మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రేమమ్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో అనుపమకు వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కళ్లల్లో పడింది అనుపమ.. వెంటనే ఆమెను తన సినిమాలో ‘అ ఆ’ ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో తనదైన నటనతో అలరించింది ఈ ముద్దుగుమ్మ..

Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral

తెలుగులో వచ్చిన రౌడీ బాయ్స్ల్ మూవీలోనూ నటించింది. హుషారు మూవీలో కూడా అనుపమ నటించింది. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీలో సంగీతాన్ని అందించారు. అందంతో పాటు అభినయం, అమాయకపు చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్లో చూపుల బాణాలను గుచ్చుతోంది.

Advertisement

సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది అనుపమ.. ఇటీవల అనుపమ తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు చూపుతిప్పుకోనివ్వలేనంతగా ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్న క్యూట్ అనుపమ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..

Advertisement

Read Also : Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

Exit mobile version