Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmi gautham: యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్.. ఇండియాలో ఇదే పెద్ద దరిద్రమంట!

Rashmi Gautham : బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రష్మీ గౌతమ్ చాలా మంచి మనసున్న మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతు ప్రేమికురాలిగా కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది. అయితే రష్మీ ఈ భూమ్మీద ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ అవుతుంటుంది. గత లాక్ డౌన్ సమయంలో తిండి దొరకక మనుషులతో పాటు మూగ జజీవాలు కూడా ఆకలితో అలమటించాయి స్వయంగా రోడ్డెక్కి మూగ జీవాల ఆకలిని తీర్చింది. అంతే కాదండోయ్ డాగ్ ఎడాప్షన్ గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.

ఎరైనా మూగ జీవాలను హింసిస్తే అస్సలే సహించదు. దేశంలో ఎక్కడ ఇలాంటి చర్యలు జరిగినా వెంటనే ఖండిస్తూ.. తన మనసులోని మాటలను ప్రపంచానికి చెబుతుంది. అయితే తాజాగా ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఉదంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆవులను ఓ వైపు గోమాత అని పిలిస్తూ.. మరో వైపు వాటి చర్మాలతో తయారు చేసిన లెదర్ వస్తువులను వాడుతుంటాం.. ఇదే ఇండియాలో ఉన్న దరిద్రం అంటూ రష్మీ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

Read Also : Hyper aadi: బిగ్ బాస్ 6కి హైపర్ ఆది, వర్షిణి వస్తున్నారట.. ప్లాన్ అదిరిందిగా!

Exit mobile version