Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Allu arjun: ఒక్క యాడ్ కు పది కోట్లు.. అయినా నో చెప్పిన బన్నీ, ఎందుకంటే?

Allu arjun: పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్వరలో పుష్ప-2 సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుండగా.. ఈ గ్యాప్ లో బన్నీ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. జాతీయ స్థాయిలో పలు సంస్థలు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు క్యూ కడుతున్నాయి. నేపథ్యంలోనే లిక్కర్, గుట్కా, బ్రాండ్ సంస్థలు కూడా అల్లు అర్జున్ తో యాడ్స్ చేయించేందుకు సంప్రదించినట్లు తెలిసింది.

బ్రాండ్ ని బట్టి 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కల్గించే వాటిని ప్రమోట్ చేసేందుకు బన్నీ ఏమాత్రం ఒప్పుకోవట్లేదట. ఇలాంటి యాడ్స్ లో నటిస్తే అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని బన్నీ ముందు జాగ్రకత్తగా ఆ సంస్థలకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

ఆకాన్ స్టార్ నిర్ణయంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఆశ పడకుండా ఇలాంటి యాడ్స్ ను దూరం పెట్టడమే బెటర్ అని అంటున్నారు. పుష్ప-2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ సినిమాపై బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version