Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha MAY 25 Today Episode : చిన్మయి తన కూతురు అనుకుంటున్న ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రాధ..?

Devatha MAY 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి, ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్లి దేవుడమ్మ, సత్య లతో ఆటలు ఆడుకుంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దేవిని ఇంటి దగ్గర దిగబెట్టడానికి దేవుడమ్మ రామ్మూర్తి ఇంటికి వస్తుంది. ముందుగానే దేవుడమ్మ ని చూసిన రాధ వెంటనే లోపలికి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు దేవుడమ్మ వెళ్ళి మీ అమ్మని పిలుచుకొనిరా నేను మాట్లాడతాను అని అనడంతో అప్పుడు దేవి వెళ్లి అవ్వ పిలుస్తుంది రావాలంట అని చెప్పగా అప్పుడు రాదా భయంతో దేవికి ఏవేవో మాటలు చెప్పి తప్పించుకుంటుంది.

Devatha MAY 25 Today Episode

దేవి మాత్రం పదే పదే రాధను రమ్మని పిలవడంతో నేను స్నానం చేస్తున్నాను అని చెప్పమని చెప్పి వెంటనే వాష్ రూమ్ లోకి వెళుతుంది రాద. అప్పుడు దేవి, దేవుడమ్మ దగ్గరికి వెళ్లి దేవి తన తల్లి రావట్లేదు అని చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు.

Advertisement

మాధవన్ చూసిన దేవుడమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మాధవ ఆదిత్య నేను ఏమీ అనలేదు అని అనడంతో ఆ విషయం కాదు మరో మాట మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది. అంతేకాకుండా పిల్లల ముందు ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత రాధ బయటకు వచ్చి డోర్ వెనకాల నిలబడి వారిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ దేవిని లోపలికి పంపించి మాధవ తో రాధా తన తల్లి కాదు అని ఎందుకు చెప్పావు అని గట్టిగా నిలదీస్తుంది. ఇక ఆ విషయం గురించి మాధవతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వారిద్దరి మాటలు విన్న రాధా లోలోపల కుమిలిపోతు ఉంటుంది.

Read Also :  Karthika Deepam MAY 25 Today Episode : నిరుపమ్ చేసిన పనికి షాక్ అయిన శోభ.. ఆనందంలో హిమ..?

Advertisement

మరొకవైపు భాగ్యమ్మ మందు తాగుతూ తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన భాష మా ఏమైంది అత్తమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అంటాడు. అప్పుడు భాగ్యమ్మ అవేవీ చెప్పకుండా నా బిడ్డ ను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి భాషను అక్కడినుంచి పంపిస్తుంది.

మరోవైపు రాధ దేవి దగ్గరికి వెళ్లి ఎప్పుడు కూడా మా అమ్మ ఎవరు అని అడగనని ఒట్టు వెయ్యమని అనడంతో.. నువ్వే మా అమ్మ వైతే నాకు నువ్వు మళ్ళీ అబద్దం చెప్పా అని ఒట్టు వెయ్యు అని దేవి అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్లిపోయిన రాధ కుమిలిపోతూ ఉంటుంది.

మరొకవైపు దేవుడమ్మ ఆదిత్య తో మాట్లాడుతూ.. దేవి వాళ్ళ అమ్మ రాధ కాదని దేవి చెప్పింది అనటంతో వెంటనే ఆదిత్య షాక్ అవుతాడు. అంటే చిన్మయి తన కూతురు అని గతంలో మాధవ చిన్మయి ఇస్తా అంటే కూడా నేనే పొరపాటు పడ్డాను అని మాధవ తప్పుకాదని అనుకుంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha: మాధవ ప్లాన్ సక్సెస్.. రుక్మిణి బతికే ఉంది అని తెలుసుకున్న దేవుడమ్మ..?

Exit mobile version