Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi: అభి ప్లాన్ ను తిప్పికొట్టిన అంకిత తండ్రి.. షాక్ లో గాయత్రి..?

Intinti Gruhalakshmi: తెలుగు తెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య, గాయత్రి ఇద్దరూ తులసిపై లేనిపోనివన్నీ చెప్పి అభి ని రెచ్చగొడతారు.

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య ఆస్తి మొత్తం అభి పేరుమీద రాయమని గాయత్రికి సలహా ఇస్తుంది. అప్పుడు అది మొదట వద్దు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ మాటలకి ఒప్పుకుంటాడు. అప్పుడు గాయత్రీ ఎలా అయినా ఆస్తి మొత్తం అభి పేరు మీద రాసి ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అభిలాషకు థాంక్స్ చెబుతాడు.

Advertisement

మరొకవైపు తులసి ఇంట్లో పాట పాడుతూ వంట చేస్తూ ఉండగా ఆ పాటను పరంధామయ్య ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో తులసి ఫ్యాక్టరీ ఓనర్ వచ్చి ఆ ఫ్యాక్టరీ బాధ్యతలను చూసుకోమని చెప్పగా అప్పుడు తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అతను డబ్బు సహాయం కావాలా అని అనగా తులసి అవును అని అంటుంది.

కానీ అతనిని డబ్బు సహాయం తనకు కాదని పార్టీలో పనిచేసిన ఒక ఆవిడకు ఇవ్వమని చెబుతుంది. పార్టీలో పనిచేసే ఒక ఆవిడ కాళ్లకు గాయం అయిందని ఆమెకు డబ్బు అవసరం చాలా ఉందని, అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు తనకు కాకుండా ఆవిడకు ఇవ్వండి అని తులసి చెప్పడంతో ఫ్యాక్టరీ ఓనర్ తులసి ని గొప్పగా పొగిడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

ఆ తరువాత పరంధామయ్య తులసి కాసేపు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు అభి తన చేతికి ఆస్తులు మొత్తం వచ్చిన విధంగా సంతోషపడుతూ ఆ విషయాన్ని తన తండ్రికి ఫోన్ చేసి సంతోషంగా చెప్తాడు. అందులో తులసి ఆంటీ సహాయం కూడా ఉంది మా మామ్ కూడా ఇలా నా కోసం ఎప్పుడూ చేయలేదు అంటూ తులసి గురించి నెగిటివ్ గా మాట్లాడుతాడు అభి.

Advertisement

అదే ఈ విషయాన్ని నందు లాస్య తో షేర్ చేసుకొని సంతోష పడుతూ ఉంటాడు. మరొక వైపు గాయత్రీ తన ఆస్తి మొత్తం అల్లుడి పేరు మీద రాయమని భర్తకు చెబుతుంది. అభి గాయత్రి ఇద్దరూ ఆస్తి ఎవరి పేరు మీదకి వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో అంకిత పేరు మీద తన తండ్రి ఆస్తి రాయడంతో వెంటనే గాయత్రి భర్త పై విరుచుకు పడుతుంది. దానితో ఆమె ఒక్క సారిగా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version