Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi july 25 Today Episode : తులసి ప్రపోజల్ కి ఓకే చెప్పిన సామ్రాట్.. ఆనందంలో తులసి కుటుంబం..?

Intinti Gruhalakshmi july 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు లాస్య సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ ఎక్కువ మంది రావడంతో నందు, లాస్య ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటూ గొప్పగా చెబుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ దగ్గరికి వెళ్లి నీ ఆలోచన సక్సెస్ అయ్యింది రా చాలా మంది ఇంటర్వ్యూకు వచ్చారు అని మాట్లాడుతూ ఉండగా సామ్రాట్ మాత్రం తులసి గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత సామ్రాట్ తులసి గురించి మాట్లాడుతూ తులసి ఒక గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటాడు.

Intinti Gruhalakshmi july 25 Today Episode :Abhi returns to Tulasi’s house to convince Ankitha in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కూడా తులసి గురించి మరింత గొప్పగా చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత నందు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా ఇంతలో తులసి రావడంతో తులసిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత నందు వాళ్ళు తులసి దగ్గరికి వెళ్లడంతో తులసి వారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు తులసి బిజినెస్ ప్రపోసల్ మీద వచ్చింది అని తెలుసుకున్న నందు,లాస్య తులసిని చులకన చేస్తూ వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటారు. ఇంతలోనే సామ్రాట్ పిలుస్తున్నాడు అనడంతో నందు వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత నందు సామ్రాట్ లు ఐడియా గురించి మాట్లాడుకుంటూ ఉండగా తులసి వెళ్లి అందరికీ హాజరైన వారి పక్కలో కూర్చుంటుంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Intinti Gruhalakshmi july 25 Today Episode :Abhi returns to Tulasi’s house to convince Ankitha in todays intinti gruhalakshmi serial episode

అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసిని నేరుగా సామ్రాట్ దగ్గరకు పిలుచుకుని వెళతాడు. అప్పుడు తులసిని చూసిన సామ్రాట్ తులసికి ఈ విధంగా సహాయం చేసే అవకాశం ఇచ్చావా దేవుడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసీ తన ప్రపోజల్ గురించి చెప్పగా నందు లాస్య వెటకారంగా మాట్లాడడంతో వెంటనే తులసి వారికి ఇది చెప్పే విధంగా తన ప్రపోసల్ గురించి గొప్పగా వివరిస్తుంది. అప్పుడు సామ్రాట్ కూడా వెరీ గుడ్ అంటూ క్లాప్స్ కొడుతూ తులసి ప్రపోజల్ కీ ఓకే చెప్పి వెంటనే లోన్ వచ్చేలా చూడండి.అలాగే మ్యూజిక్ స్కూల్ కీ కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకోండి అని నందు లాస్యకు అలాగే వాళ్ళ బాబాయ్ కి చెప్పడంతో వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత తులసి ఆనందంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోతుంది. ఇంట్లో వాళ్లకు కూడా అసలు విషయం చెప్పడంతో ఆనందపడుతూ ఉంటారు.

Advertisement

ఈ శుభ సందర్భంలో పండుగ చేసుకుందాం అని అనగా ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు. అభి రావడంతో అందరూ సంతోషపడుతూ ఉండగా అభి మాత్రం మీరందరూ నా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు నేను మారిపోలేదు ఎవరి మీద అభిప్రాయాలు మారలేదు అని అంటాడు. అప్పుడు అంకిత దగ్గరికి వెళ్లి నీ కోసం వచ్చాను నీ మీద ప్రేమ కోసం వెతుక్కుంటూ వచ్చాను అని అంటాడు. కానీ అంకిత మాత్రం చిరాకు పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఫ్రేమ్ కూడా ఇంటికి రావడంతో తులసి సంతోషపడుతూ ఉంటుంది. శృతి గురించి అడగా శృతి వాళ్ళ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళింది అని చెబుతాడు. అప్పుడు ఫోన్ చేయడంతో ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Intinti Gruhalakshmi : అభి మాటలకు ఎమోషనల్ అయిన తులసి..అభిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన గాయత్రి.?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version