Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Adhar cards : ఇంటి నుంచే ఆధార్ నమోదు.. ఏం చేయాలంటే?

Adhar cards : ఆధార్ కార్డులో ఏ చిన్న మార్పు చేసుకోవాలన్నా, మళ్లీ దిగాలన్నా, పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలన్నా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. టోకెన్లు తీస్కొని మరీ గంటలు గంటలు వేచి చూడాల్సిందే. మామూలు వాళ్ల పరిస్థితే చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ చిన్న పిల్లలతో వెళ్లిన వారి అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం ఐదేళ్ల లోపు చిన్నారులకు.. వారి ఇంటికి వెళ్లి ఆధార్ నమోదు చేసేందుకు పోస్టల్ శాఖకు అనుమతి ఇచ్చింది.

Adhar cards

ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ తీసుకోవడం కోసం మీరు చేయాల్సిందల్లా… సమీపంలోని పోస్ట్ ఆఫీసులో సమాచారం ఇవ్వడమే. లేదంటే పోస్ట్ మాన్ కు ఫోన్ చేసినా చాలు… వారే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలను పోస్టల్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా పోస్టల్ సిబ్బంది కార్డు అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం పోస్ట్ మెన్ లకు పోస్టల్ శాఖ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంతే కాదండోయ్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిభారాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

చిన్న పిల్లల వేలి ముద్రలు స్పష్టంగా ఉండవనే ఉద్దేశంతో ఆధార్ నమోదులో అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారుకు బయోమెట్రిక్ మినహాయింపు ఇచ్చారు. దీంతో వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్ తీస్కొని.. పిల్లలకు నిర్ణీత వయసు వచ్చాక వేలి ముద్రలను సేకరించి ఆధార్ ను అప్ డేట్ చేస్తారు.

Advertisement

Read Also :  Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!

Exit mobile version