Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : చదివి చదివి ములోడినైపోతా.. బాలుడి ఫన్నీ వీడియో

Viral Video : చాలా మంది తమ చిన్నతనంలో బడికి వెళ్లాలంటే చాలా మారాం చేసే ఉంటారు. కడుపు నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి స్కూల్ కు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ అమ్మలు ఉన్నారే.. వాళ్లు మన నటనను ఇట్టే గుర్తు పట్టేస్తారు. బడికి వెళ్లాలని లేదని చెప్పినా వినకుండా స్కూల్ కు పంపిస్తారు. అలాగే హోం వర్క్ విషయంలోనూ అంతే. హోం వర్క్ చేయకుండా తప్పించుకోవాలని చూస్తాం మనం. కానీ దానిని కూడా ఇట్టే పసిగట్టి హోంవర్క్ చేసేంత వరకు వదిలి పెట్టరు అమ్మలు.

A boy crying because his mother tells him to study video goes viral

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి పిల్లల వేషాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. నేను స్కూల్ కు వెళ్లనంటూ ఏడుస్తూ చెప్పే చాలా వీడియాలను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. అందులో ఓ బుడ్డోడు.. తనతో బలవంతంగా హోం వర్క్ చేయిస్తున్న తల్లిపై సీరియస్ అవుతున్నాడు. అయినా ఆ తల్లి తనను వదిలిపెట్టకుండా హోం వర్క్ చేయిస్తూనే ఉంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఆ పిల్లాడు బెడ్ పై కూర్చున్నాడు. చేతిలో పెన్సిల్, నోట్ బుక్ ఉంది. ఎదురుగా తన తల్లి కూర్చుని ఉంది. తన తల్లి బలవంతంగా హోం వర్క్ చేయిస్తున్నట్లు చూస్తే అర్థం అవుతోంది. హిందీ రాయమని చెబుతున్నట్లు వినిపిస్తోంది. తల్లి తీరుతో బుడ్డోడికి ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నా జీవితాంతం చదువుతూనే నేను ముసలివాడిని అవుతాను అంటూ తల్లిపై కోప్పడుతున్నాడు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : King cobra viral video: ఆరడుగుల కింగ్ కోబ్రా నోటి నుంచి బయటకొచ్చిన మరో పాము..!

Advertisement
Exit mobile version