Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ziziphus Oenoplia : పరికి పండ్లు ఎప్పుడైనా తిన్నారా? చెట్టుంతా ఔషధాల గని.. సర్వరోగనివారిణి..!

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

Ziziphus Oenoplia : పరికి చెట్టు..(Ziziphus Oenoplia) అదేనండీ.. పరికి కంప చెట్టు.. పరికి కాయలు, పరికి పండ్లు.. (Pariki Chettu) అని చిన్నప్పుడు వినే ఉంటారు. ఇంతకీ ఈ చెట్లను చూస్తే ఏదో పిచ్చి కంప చెట్లలా కనిపిస్తుంది కానీ, ఇందులోనే ఔషధ గుణాల గురించి తెలిస్తే.. అసలే వదిలిపెట్టరు.. వెంటనే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటారు. ఈ చెట్టుంతా ఔషధాల గని.. ఎలాంటి రోగమైన తోకమూడవాల్సిందే.. సాధారణంగా గ్రామాల్లోని పోలాల్లో ఎక్కువగా కనిపించే ఈ కంప చెట్టు చూడటానికి అచ్చం రేగి చెట్టులానే ఉంటుంది. చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గ్రామాల్లో పరిక కాయల చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చెట్లు పొలాల్లో బాగా కనిపిస్తాయి.

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

పరిక చెట్టు లేదా దీనికి వృక్ష శాస్త్రీయ నామం ((Ziziphus Oenoplia)గా పిలుస్తారు. ఈ పరిక చెట్టు ముళ్లతో నిండి ఉంటుంది, ఈ ముళ్ళు చాలా గట్టిగా పదనుగా ఉంటాయి. ఈ చెట్టు 5 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. ఇతర చెట్ల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పరిక చెట్ల కాయలు చిన్నగా బటానీ గింజల్లా ఉంటాయి. పచ్చి కాయలు ఆకుపచ్చగా, దోర కాయలు ఎరుపు రంగులో, బాగా పండినవి నలుపు రంగులో కనిపిస్తాయి.

ఈ కాయలను విత్తనాలతో కలిపి నమిలి తింటారు. బాగా పండిన కాయలు పుల్లగా, తీయగా రుచికరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయలను తింటే గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. చిగుళ్ల సమస్యలను చిటికెలో మాయమైపోతాయి. దంతాలకు రక్షణ ఇస్తాయి. ఈ చెట్టు కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Advertisement

Read Also : Krishna Tulsi Plant : ‘కృష్ణతులసి’ వేరుకు ఎంత పవర్ ఉందో తెలుసా.. జంటలు రాత్రుళ్లు అలసిపోవాల్సిందే..! 

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

ఈ పండ్లను నిత్యం తింటుంటే తలనొప్పి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా పెరుగుతుందట.. ఇక నరాల సమస్యలను కూడా నయం చేస్తుంది. పుండ్లు వెంటనే మానేలా చేయగల ఔషధ గుణాలు ఈ పరిక పండ్లలో ఉన్నాయి. ఈ పండ్లను ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ కూడా దరిచేరదట.. ఒక్క పరికి కాయలే కాదండోయ్.. పరిక కంప చెట్టు ఆకులు, దాని బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ చెట్టు ఆకులతో బెరడుతో ఏయే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఎన్ని ఉపయోగాలో తెలుసా? ఇవిగో.. 
మీరు చేయాల్సిందిల్లా.. పరికి కాయల చెట్టును సేకరించండి. ఆ తర్వాత ఆ చెట్టు ఆకులను బాగా దంచాలి. ఆ తర్వాత ఆ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు తగిలిన ప్రాంతంలో పెట్టి కట్టు కట్టాలి. తద్వారా వెంటనే పుండ్లు, గాయాలు ఏమైనా సరే వెంటనే తగ్గిపోతాయి. గజ్జి తామరతో పాటు దురద సమస్యతో బాధపడేవారు కూడా ఈ ఆకులను ముద్దగా నూరుకుని ఆ రసాన్ని రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. ఈ ఆకుల రసాన్ని ఒక గ్లాసులో వేసి బాగా మరిగించుకోవాలి. కషాయాన్ని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఈ ఆకుల కషాయాన్ని నోట్లో పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది. నోటి దుర్వాసన మాత్రమే కాదు.. చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు పరిక ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.

Ziziphus Oenoplia : Pariki Chettu health benefits in telugu, You Must Know These Facts

ఈ చెట్టు కాండం బెరడుతో గొంతు నొప్పితో బాధపడేవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడుతో శరీరానికి టాన్ చేయడానికి కూడా వినియోగించవచ్చు. పరికి కాయల చెట్టు బెరడును ఎండబెట్టి బాగా దంచి పొడి చేసుకోవాలి. చెట్టు బెరడును పొడి స్క్రబ్‌లా వినియోగించుకోవచ్చు. ఈ చెట్టు బెరడును ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత కషాయంలో తయారు చేసుకుని తాగితే అనేక అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి అంతే.. అంత గొప్ప శక్తి ఈ పరికి చెట్టులో దాగి ఉంది.

Read Also : Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?

Advertisement
Exit mobile version