G
Telugu News » Health News » oily skin problems remedies in telugu
⚡ Health News, Latest

Oily Skin : ఆయిల్ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి!

Oily skin: చర్మంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలా ఆయిల్ స్కిన్ ఏర్పడటం సహజమైన ప్రక్రియ... అయితే అధికంగా నూనె రిలీజ్ అయితే అప్పు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Oily skin: చర్మంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలా ఆయిల్ స్కిన్ ఏర్పడటం సహజమైన ప్రక్రియ… అయితే అధికంగా నూనె రిలీజ్ అయితే అప్పుడు మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. కనుక జిడ్డు చర్మం గలవారు ఇతరుల కంటే తమకు తాము ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. Stylecrase.com లో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. జిడ్డుగల చర్మం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయని.. నల్ల మచ్చలు లేదా డెడ్ స్కిన్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారు పగలు మాత్రమే కాదు రాత్రి సమయాల్లో కూడా స్కిన్ కేర్ ను తీస్కోవాలి.

Advertisement

క్లెన్సర్ తో శుభ్రం.. రాత్రి పడుకునే ముందు మీ జిడ్డు చర్మాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోండి. దుమ్ము, ధూళి, తేమ కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది.

ఫేస్ మాస్క్ ఉత్తమం.. జిడ్డు చర్మం ఉన్న వారు వారానికి ఒకసారి రాత్రి పూట ముల్తానీ మట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే మృత చర్మకణాలను తొలగిస్తుంది.

నాన్ ఆల్కహాల్ టోనర్.. ముఖానికి తగిన టోనర్ రాయడం అవసరం. చర్మాన్ని బట్టి టోనర్ ను కూడా ఎంచుకోవాలి. ఆయిల్ స్కిన్ గలవారు ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ను ఉపయోగించండి. ఎందుకంటే ఇది పీహెచ్ స్థాయిని నియంత్రిస్తుంది.

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Oily skinSkin tipskin tonestips for beautifyl skin
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు