Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hang Over : హ్యాంగోవర్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా…

Hang Over : మద్యం సేవించిన తర్వాత చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెట్టె విషయం ” హ్యాంగోవర్ “. పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది, దీని కారణంగా అలసట, బద్ధకం, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే మరి ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం…

ఆల్కహాల్ తాగే వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ తాగినప్పుడు హ్యాంగోవర్ ఉండదు. మద్యం మన శరీరంలో ఉండే నీటి శాతాన్ని పీల్చేస్తుంది. ఈ కారణంగా తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకనే ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు.

అదే విధంగా అరటిపండు, పీనట్ బట్టర్, మామిడి, పాస్తా వంటివి తీసుకుంటే హైడ్రేట్ గా ఉండొచ్చు. నిమ్మకాయ కూడా హ్యాంగోవర్ సమస్యలను తగ్గిస్తుంది. అలానే తేనే తీసుకోవడం వల్ల ఆల్కహాల్ని తొందరగా బయటకు పంపేలా చేస్తుంది.

Advertisement

హ్యాంగోవర్ తో పాటు తల పట్టేసినట్టు ఉంటే అల్పాహారం సమయంలో గుడ్లని తీసుకోండి. ఇలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడవచ్చు. హ్యాంగోవర్ తగ్గాలంటే ఆరెంజ్, నిమ్మ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే అల్లం, తేనె బ్లాక్ టీ తాగండి. అల్లం కడుపు సమస్యలను తొలగిస్తుంది. తేనె టీ రుచిని మెరుగుపరుస్తుంది. దీనితో మీ తలనొప్పి పోతుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య ఉండదు. మరో ముఖ్య విషయం ” మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం “.

Read Also : Actor Vaishnav Tej : బటర్‌ఫ్లై కిస్ అంటే తెలుసా అంటున్న కేతిక శర్మ… నెక్స్ట్ లెవెల్ అని వైష్ణవ్ రిప్లై!

Advertisement
Exit mobile version