Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Diabetes Reverse Diet Plan : దీర్ఘకాలంగా షుగర్ వేధిస్తుందా? ఇలా చేస్తే.. మీ ఒంట్లో షుగర్‌ దెబ్బకు నార్మల్‌కు వచ్చేస్తుంది.. మందులు లేకుండా కేవలం డైట్ మాత్రమే..!

Diabetes Reverse Diet Plan _ The Best Indian Diabetes Diet Plan to Control Blood Sugar in Telugu

Diabetes Reverse Diet Plan _ The Best Indian Diabetes Diet Plan to Control Blood Sugar in Telugu

Diabetes Reverse Diet Plan : షుగర్ వ్యాధి.. (మధుమేహం).. డయాబెటిస్ అని కూడా అంటారు. ఈ పేరు వింటే చాలు.. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వణుకు పుడుతుంది. అలాంటి షుగర్ మహమ్మారి ఒకసారి మీ శరీరంలోకి వచ్చిందంటే జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. షుగర్ మందులు చనిపోయేంత వరకు వాడాల్సిందే అని అంటుంటారు. వాస్తవానికి ఈ డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ప్రస్తుత జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా 30ఏళ్ల వయస్సులోనే షుగర్ కాటేస్తోంది. యువకులు ఎక్కువగా ఈ షుగర్ బారిన పడుతున్నారు. దీనికి కారణం.. వారి లైఫ్ స్టయిల్ అని చెప్పవచ్చు.

అసలు ఈ షుగర్ ను పూర్తి నయం చేయాలేమా అంటే.. అందరూ లేదు అని చెబుతుంటారు. కానీ, ఈ షుగర్ ను పూర్తి స్థాయిలో రివర్స్ చేయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఈ డయాబెటిస్ రావడానికి మూల కారణం ఏంటో కనుగొన్నారు. షుగర్ వ్యాధిలో లివర్ పాత్ర చాలా కీలకమని గుర్తించారు. క్యాలరీ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా లివర్‌లో ఫ్యాట్‌ సెల్స్‌ పుట్టుకొస్తాయి.

Diabetes Reverse Diet Plan _ The Best Indian Diabetes Diet Plan to Control Blood Sugar in Telugu

తద్వారా లివర్‌ పూర్తిగా ఫ్యాట్‌‌ పెరుకుపోతుంది. క్రీమీ లాంటి పదార్థం లివర్‌ నుంచి రక్తంలోకి చేరుతుంది. ఈ క్రీమీ టెక్స్చర్‌ మారి కండరాలు, ప్యాంక్రియాస్, గుండె ఆర్టరీస్‌లోకి వచ్చి చేరుతుంది. దాంతో ప్యాంక్రియాస్‌ పనితీరు మందగిస్తుంది. తద్వారా ప్యాంక్రియాస్‌ ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా ప్యాంక్రియాస్‌ ఇన్సులిన్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలు తగ్గడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.

Advertisement

Diabetes Reverse Diet Plan : టైప్-2 డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ చేసే అద్భుతమైన డైట్..  

శరీరంలో డయాబెటిస్ ఒక్కసారి ఎంటర్ అయ్యాక.. అది పూర్తిగా నయం కాదు అనేది మాత్రం అపోహ మాత్రమే.. డయాబెటిక్ నిపుణులు చేసిన పరిశోధనలో ఇది నిజం అని తేలింది. పరిశోధనలో భాగంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న 12 మందికి తక్కువ క్యాలరీల లిక్విడ్‌ డైట్‌ అందించారు. అలా 8 వారాలు అదే డైట్‌ను కంటిన్యూ చేశారు. 8 వారాల తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్‌‌కి వచ్చేశాయి. మీరు సిరి ధాన్యాలు, జొన్న జావా, వంటి ఆహారాలను ద్రవరూపంలో ఎక్కువగా తీసుకుంటుండాలి. అంతేకాదు.. వైట్ రైస్ అసలే తీసుకోకూడదు. కేవలం వీటిని మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తుండాలి.

ఈ డైట్‌ తర్వాత.. లివర్‌, ప్యాంక్రియాస్‌లో కొవ్వు కూడా భారీగా కరిగిపోయింది. క్రీమీ పదార్థం సైతం మాయమైపోయింది. షుగర్ పేషెంట్లకు కేవలం డైట్‌లో మార్పులు చేయడంతోనే అద్భుతంగా డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అయింది. షుగర్ మందులు కూడా ఇవ్వలేదు. అంతేకాదు.. 10 నుంచి 15 కేజీల బరువు కూడా తగ్గారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు కూడా నార్మల్‌ అయ్యాయట.. ఇదే డైట్ కంటిన్యూ చేస్తూ పోతే.. ఏడాదిలో డయాబెటిస్ పూర్తిగా తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడించారు.

Read Also : Moong Dal Soup Tips : పెస‌ర‌ప‌ప్పు సూప్‌ తాగి చూడండి.. ఎలాంటి జ్వ‌రమైనా ఇట్టే తగ్గిపోతుంది.. రుచికి రుచి.. ఎంతో ఆరోగ్యం..!

Advertisement
Exit mobile version