Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rythu Bharosa 2026 : రైతు భరోసా డబ్బులు పడేది ఈరోజే? ఒకే విడతలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు?

Rythu Bharosa 2026

Rythu Bharosa 2026 ( Image Credit: AI-generated using ChatGPT )

Rythu Bharosa 2026 funds release Feb 17 : తెలంగాణ రైతులకు బిగ్ గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడనున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 17న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రైతులకు పండగే.. గతంలా కాకుండా ఇప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా డబ్బులను (Rythu Bharosa 2026) విడుదల చేయనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో ఎకరాల చొప్పున రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకూ విడుదల అయ్యేవి. ఎకరం, రెండు ఎకరాల ఒకసారి ఆ తర్వాత 5 ఎకరాల వరకు, ఆపై 10 ఎకరాల వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను విడుదల చేసేవారు.

Read Also : Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, ప్రతి పేమెంట్ లెక్క చెప్పాల్సిందే, పన్ను కట్టాల్సిందే!

Advertisement

Rythu Bharosa 2026 : ఒకే విడతలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ :

ఈ ప్రక్రియకు మొత్తం విడుదలకు 9 రోజుల వరకు సమయం పడుతుంది. ఇకపై అలా కాకుండా రైతు భరోసా పంట పెట్టుబడి డబ్బులను తెలంగాణ ప్రభుత్వం ఒకే విడతలో రైతుల ఖాతాల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

రైతు భరోసా విడుదల కోసం రేవంత్ సర్కార్ ఫండ్స్ సమీకరించుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే రైతు భరోసా పంట సాయం విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలు వల్ల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అదే సమయంలో విడుదల కావడంతో రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యమైంది.

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.9 వేల కోట్లు నిధులు సైతం సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది.

Advertisement
Exit mobile version