- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం
- రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సాయం
- రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో పొందొచ్చు
- రైతులు వీలైనంత త్వరగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి
PM Kisan 22nd installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 22వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీరు ఇంకా e-KYC ప్రాసెస్ పూర్తి చేయలేదా? అలా చేయకపోతే మీ డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది.
వాస్తవానికి, మీడియా నివేదికల ప్రకారం.. రైతులు వీలైనంత త్వరగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 6,000 పొందవచ్చు. రైతులు తప్పనిసరిగా వ్యాలీడ్ రైతు ఐడీని కలిగి ఉండాలి. ఇది ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
పీఎం కిసాన్ e-KYC ప్రాసెస్ ఏంటి? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందే రైతులు ఈ-కెవైసిని 3 పద్ధతుల ద్వారా పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. ఈ-కెవైసీని పూర్తి చేయని రైతులకు రావాల్సిన వాయిదా ఆలస్యం కావచ్చు లేదా నిలిపివేయవచ్చు.
OTP ఆధారిత e-KYC కోసం రైతులు వారి ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. ఇందుకోసం అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ ( https://pmkisan.gov.in/)ని విజిట్ చేయండి. ఆ తర్వాత e-KYC ఆప్షన్ కు వెళ్లి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఉపయోగించి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
PM Kisan 22nd installment : ఇప్పుడు రైతు ఐడీ కూడా తప్పనిసరి :
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు e-KYCతో పాటు రైతు ఐడీ ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రైతు ఐడీని వారి పీఎం కిసాన్ ఖాతాకు లింక్ చేయని రైతుల తదుపరి వాయిదాను నిలిచిపోతుంది. నివేదికల ప్రకారం.. రాబోయే విడతకు ముందే ఈ షరతును కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది.
రైతులు వీలైనంత త్వరగా తమ పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. e-KYC పూర్తయిందని బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉందని, రైతు ఐడీ వ్యాలీడ్ గా ఉందని నిర్ధారించుకోవాలి. అసంపూర్ణ సమాచారంతో ఆలస్యం కావచ్చు లేదా రాబోయే వాయిదా కూడా ఆగిపోవచ్చు.
పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి? :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలు సంవత్సరానికి మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయం అందుకుంటారు.
ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో బదిలీ అవుతాయి. ఈ పథకం డిసెంబర్ 1, 2018న ప్రారంభమైంది. దీని మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లబ్ధిదారులను గుర్తిస్తాయి.
పీఎం కిసాన్ 22వ వాయిదా ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ 22వ విడత రూ.2,000 కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు అనేది తేదీని ప్రకటించలేదు. సాధారణంగా, ఈ రూ. 2వేలు ప్రతి నాలుగు నెలలకు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. మీడియా నివేదికల ప్రకారం.. వచ్చే విడత ఫిబ్రవరిలో రావచ్చు.

