AP Free Bus Scheme 2026 : ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. స్త్రీ శక్తి పథకం పేరుతో ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్ వంటి వ్యక్తులు కొన్ని ఎంపిక చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు.
పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వాత్రంత్య దినోత్సవం రోజు (AP Free Bus Scheme 2026) ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యవేక్షణలో అధికారికంగా ప్రారంభించింది. విజయవాడ బస్ స్టేషన్‌లో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ గ్యారెంటీస్ లో ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒకటి.
AP Free Bus Scheme 2026 : ఈ ఉచిత పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏంటి?
ఉచిత ప్రయాణ పథకం అనేది మహిళల ఆర్థిక స్వాంత్రత్యాన్ని బలోపేతం చేయడమే.. ముఖ్యంగా ఉద్యోగ మహిళలు, విద్యార్థులు, వైద్య ప్రయోజనాల కోసం ప్రయాణించేవారికి ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు మద్దతు అందించవచ్చు. బాలికలు అయితే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించవచ్చు. ట్రాన్స్ జెండర్లకు అందరితో సమాన ప్రయాణ అవకాశాలను కల్పించవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణాల్లోని మహిళలు బస్సు ఛార్జీలు భారంగా మారకుండా ఉంటుంది. తక్కువ ఖర్చులో ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు.
AP Free Bus Scheme 2026 : ఏయే బస్సుల్లో అనుమతిస్తారంటే?
- పల్లె వెలుగు బస్సులు
- అల్ట్రా పల్లెవెలుగు బస్సులు
- ఎక్స్ ప్రెస్ బస్సులు
- మెట్రో ఎక్స్ ప్రెస్
- సిటీ ఆర్డినరీ బస్సులు
ఈ ఉచిత బస్సు సర్వీసులు కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయి. ఏపీ రాష్ట్ర సరిహద్దుల తర్వాత ఉచిత ప్రయాణం వర్తించదు.
Read Also : PM Kisan Yojana : రైతులకు భారీ గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?
పథకం వర్తించని బస్సులివే
ప్రీమియం, ప్రత్యేక కేటగిరీ బస్సులకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదు.
- సూపర్ లగ్జరీ బస్సులు
- ఏసీ బస్సులు
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు
- అల్ట్రా డీలక్స్ బస్సులు
- అంతర్రాష్ట్ర సర్వీసులు
- చార్టర్డ్, టూర్ ప్యాకేజీ బస్సులు
బస్సు ఎక్కే ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా బస్సు ఎక్కే సమయంలోనే అది ఏ బస్సు సర్వీసు అనేది తెలుసుకోవడం ముఖ్యం.
అర్హత ప్రమాణాలివే
ఉచిత బస్సు ప్రయాణ పథకం అర్హత పొందాలంటే తప్పనిసరిగా ప్రయాణికులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉండాలి
- స్త్రీ లేదా మహిళ, బాలిక, ట్రాన్స్ జెండర్ అయి ఉండాలి
- ప్రయాణ సమయంలో ప్రభుత్వ జారీ చేసిన ఐడింటిటీ కార్డు కలిగి ఉండాలి.
- ఉచిత బస్సు ప్రయాణానికి ఆదాయం పరిమితి లేదు అలాగే వయో పరిమితి కూడా లేదు. అన్ని వయస్సుల వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.
బస్సు ఎక్కే ముందు ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే
ప్రయాణ సమయాల్లో బస్సు ఎక్కేటప్పుడు మహిళలు కండక్టర్ అడిగే డాక్యుమెంట్లను ఒరిజినల్స్ చూపించాలి. అందులో ముఖ్యంగా ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటర్ గుర్తింపు కార్డు
- ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఏదైనా ఐడీ కార్డు
మీ గుర్తింపును వెరిఫై చేశాక బస్సు కండక్టర్ మీకు జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. అర్హత కలిగిన బస్సు ప్రయాణాలకు కేవలం ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఎలాంటి టికెట్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
సంప్రదించాల్సిన సమాచారం :
ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు లేదా అదనపు వివరాలు పొందాలంటే ప్రయాణీకులు APSRTC కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.
కస్టమర్ కేర్ నంబర్ : 0866-2570005 డయల్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్: (https://www.apsrtc.ap.gov.in) విజిట్ చేయండి.

