Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Free Bus Scheme : మహిళలతో పాటు పురుషులకు ఫ్రీ బస్సు సౌకర్యం.. మార్చి 1 నుంచి అమల్లోకి, ప్రభుత్వం ఉత్తర్వులు

Men Free Bus Scheme

Men Free Bus Scheme

Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు భారీ గుడ్ న్యూస్. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. మార్చి ఫస్ట్ తారీఖు నుంచి ఈ కీలక నిర్ణయం అమల్లోకి వచ్చేసింది.

గత ఫిబ్రవరి 28నే ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయగా, ఫిబ్రవరి 24న సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్ మీటింగ్ లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వెంటనే అమల్లోకి వచ్చింది. ఇంద్రధనస్సు పేరిట దివ్యాంగులకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం.

Free Bus Scheme : ఏయే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటే? :

రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. అలాగే, స్త్రీశక్తి పథకం కూడా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకాన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.

Advertisement

Read Also : AP Free Bus Scheme 2026 : మహిళల కోసం ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్.. అర్హతలివే? కొత్త రూల్స్ ఏంటి? ఫుల్ డిటెయిల్స్

దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అంతర్ రాష్ట్ర బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుంది. 40 శాతం ఆపై ఎక్కువ వైక్యలం కలిగిన దివ్యాంగులకు ఈ ఇంద్రధనస్సు పథకం వర్తిస్తుంది. ఏపీ రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉండగా అందరికి ఈ పథకం వర్తిస్తుంది.

దివ్యాంగుల కోసం ఇంద్ర ధనస్సు పథకం :

2025 డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు అద్భుతమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఇంద్రధనస్సు అనే ప్రభుత్వ పథకం ద్వారా దివ్యాంగులకు ఏకంగా 6 పథకాలను ప్రకటించారు. ఆ పథకాల్లో ఉచిత బస్సు పథకం ఒకటి. దివ్యాంగుల కోసం ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లపై 50 శాతం రాయితీ అందిస్తుండగా ఇప్పటినుంచి ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు.

Exit mobile version