Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ajay Devgn: హిందీ జాతీయ బాషే… ఆ స్టార్ హీరోల మధ్య మొదలైన ట్వీట్ వార్!

Ajay Devgn: కన్నడ స్టార్ హీరో సుదీప్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోల మధ్య హిందీ భాష గురించి గొడవ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు.

ఇటీవల నిర్వహించిన ‘ఆర్‌: ది డెడ్‌లీస్ట్‌ గ్యాంగ్‌స్టర్‌ ఎవర్‌’ అనే సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమంలో సుదీప్ మాట్లాడుతూ… ” కన్నడ సినీ పరిశ్రమ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తోందని కొందరు అంటున్నారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. పాన్ ఇండియా స్థాయి అని కాకుండా ప్రపంచంలోని సినీ అభిమానులందరినీ అలరించడానికి మనం సినిమాలు చేస్తున్నాం. హిందీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నా కూడా వాటిని తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ ఆ సినిమాలు విజయ సొంతం చేసుకోలేక పోతున్నాయి”. అంటూ సుదీప్ మాట్లాడాడు.

Advertisement

 

ఇలా సుదీప్ మాట్లాడిన మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్పందిస్తూ..” బ్రదర్ మీఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరు ఎందుకు మీ సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి హిందీ జాతీయ భాషగా ఉంది. ఎప్పటికీ కూడా ఉంటుంది. జనగణమన” అని అజయ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇలా అజయ్ దేవగన్ చేసిన ట్వీట్ కు సుదీప్ సమాధానమిస్తూ..” అజయ్ సర్ నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటా.. మన దేశ భాషలన్నింటి పైన నాకు చాలా గౌరవం ఉంది. నేను హిందీ భాషను ప్రేమించాను కనుక హిందీ భాషను మాట్లాడటం నేర్చుకున్నాను. అందువల్ల మీరు హిందీలో పెట్టిన ట్వీట్ ని కూడా చడవగలిగాను. అదే నేను కన్నడలో సమాధానం రాసుంటే మీరు దాన్ని చదవగలరా? ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మీ దగ్గర నుండి రిప్లై ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతటితో ఈ టాపిక్ ముగిద్దాం. తొందర్లోనే మనిద్దరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను” అని సుదీప్ ట్వీట్ చేశాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య హిందీ భాష గురించి ట్వీట్ వార్ జరిగింది. మరి ఈ వారం ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Exit mobile version