Navya Swami: ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ తో పోటీగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులలతో కలిసి సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వాహకుల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ వ్యాఖ్యాతగా సూపర్ క్వీన్ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది బుల్లితెర నటీమణుల హాజరయ్యే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా కంటెస్టెంట్ లు మోచేతితో కూల్ డ్రింక్ టిన్స్ పగలగొట్టే సమయంలో కంటెస్టెంట్ నవ్య స్వామి మోచేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఇలా గాయం కావడంతో ఆమె మోచేతికి పెద్ద ఎత్తున రక్తం కారుతున్నట్టు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు నిజంగానే గాయం తగిలిందా లేకపోతే ఈ కార్యక్రమం ఎపిసోడ్ కి హైప్ తీసుకురావడం కోసం ఇలా క్రియేట్ చేశారా అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
