Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TV Actress Comments : సీరియల్ నటి సంచలన కామెంట్స్.. ట్యూషన్ టీచర్‌ అసభ్యంగా ప్రవర్తించాడంటూ..

TV actress Devoleena Shocking Revelation in Tuition Teacher Misbehave

TV actress Devoleena Shocking Revelation in Tuition Teacher Misbehave

TV Actress Comments : ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాందులు. వీరికి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చారు. అవగాహన సైతం కల్పించారు. అప్పట్లో మీటూ ఉద్యమం ఓ సంచలనంగా మారింది.

తమపై జరిగిని లైంగికదాడులను, వేధింపులు చెప్పేందుకు చాలా మంది ముందుకొచ్చారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సీరియన్ సైతం చిన్నతనంలో తనకు ఎదురైన వేధింపులను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్స్ సైతం తమ స్టైల్లో స్పందిస్తున్నారు. పలు కామెంట్స్ సైతం చేస్తున్నారు.

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్‌లో నటిస్తున్న దేవలోన భట్టా చార్యా అందరికి తెలుసు. అయితే ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. చిన్నప్పుడు తాను ట్యూషన్ కు వెళ్లే దానినని, ఆ సమయంలో ట్యూషన్ టీచర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని చెప్పితే అప్పట్లో ఎవరూ నమ్మలేదని, అందుకే పోలీసులకు సైతం కంప్లైంట్ చేయలేదని వాపోయింది.

Advertisement

తర్వాత ట్యూషన్ మానేయాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని, కాబట్టి వారు చెప్పిన విషయాలను తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోవాలని కోరింది. అయితే సదురు ట్యూషన్ టీచరు పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక ఆమె కామెంట్స్ పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. గుడి, బడి తేడా లేకుండా ఆడవారిపై, పిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే నివారించాలని లేదంటే జరగాల్సిన నష్టం జరుగిపోతుందని, ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

Read Also : Bigg Boss 5 Telugu : నేను ఆ టైంలో అక్కడుంటే ‘సిరి’ చెంప పగులగొట్టేవాడిని.. జెస్సీ సంచలన కామెంట్స్! 

Advertisement
Exit mobile version