Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actor nikhil: యువ హీరో నిఖిల్ కు పితృవియోగం..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాధం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్దార్థ ఈరోజు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అలాగే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

వ్యక్తిగంతంగానే కాకుండా కెరీర్ పరంగ కూడా నిఖిల్ కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఆయన తండ్రి… లేకోపోవడాన్ని నిఖిల్ జీర్ణించుకులేకపోతున్నారు. అయితే తనకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని ఓ సోషల్ మీడియా వేదికగా ఓ సందర్భంలో తెలిపారు. అంతే కాకుండా తన తండ్రిని అభిమానులకు కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం నిఖిల్.. కార్తికేయ 2 సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను 20 కోట్లకు సొంతం చేసుకున్నారు జీ సంస్థలు.

Advertisement
Exit mobile version