Mumaith Khan: బుల్లి తెర పై ప్రసారముతో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ కార్యక్రమం గత నెల 26వ తేదీ 17 మంది కంటే స్టెంట్లతో ప్రారంభమైంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం నామినేషన్లు ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు.వీరిలో మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు లేదా ముమైత్ ఖాన్ వెళుతుందని అందరూ భావించారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరూ కలిసి తనని ఎగ్రెసివ్ అంటూ ముద్ర వేశారని ఈమె బాధపడ్డారు. ఇక ముమైత్ఖాన్ బాధ పడటంతో నాగార్జున తన చాలా సెన్సిటివ్ అంటూ ఆమెను ఓదార్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు బెస్ట్ కంటెస్టెంట్ లను, ఐదుగురు అరెస్ట్ కంటెస్టెంట్ లను ఎంపిక చేసి వారికి టాగ్ ఇచ్చి వెళ్లారు. ఇక ముమైత్ ఖాన్ బిందుమాధవి,సరయి,మిత్ర యాంకర్ శివ, చైతూలకి వేస్ట్ ట్యాగ్స్ ఇస్తూ వాళ్లకి క్లాస్ పీకింది.