RRR Movie: సాధారణంగా సినిమాలలో ఎమోషనల్ సన్నివేశాలు వచ్చినా, లేదా తమ అభిమాన నటీనటులను ఎవరైనా బాధ కలిగించేలా మాట్లాడిన, కొట్టిన ఒక్కసారిగా అభిమానుల మనసు బరువెక్కుతుంది. ఇక పెద్ద వాళ్ళు అయితే ఇలాంటి సన్నివేశాలను చూస్తూ మనసులో బాధ పడగా మరికొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు.ఇక చిన్న పిల్లలు అయితే వారికి నచ్చిన హీరోలను లేదా హీరోయిన్లను కొట్టినా తిట్టినా తీవ్రస్థాయిలో బావోద్వేగం అవుతుంటారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇందులో కొన్ని సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించడంతో ప్రతి ఒక అభిమాని ఆ సన్నివేశాలకు ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక చిన్నారి ఈ సినిమాలో రామ్ చరణ్ ను కొట్టారని ఎంతో ఎమోషనల్ అవుతూ థియేటర్లోనే ఏడుపు మొదలు పెట్టారు. ఇక ఈ విషయాన్ని గమనించిన సదరు వ్యక్తి వీడియో తీయడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బుడ్డోడు ఏడుస్తూ రామ్ చరణ్ ను కొట్టారు. రామ్ చరణ్ ను విలన్ ను చేశారు అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఇలా ఆ చిన్నోడు ఏడవడం తో పక్కనే ఉన్న వారందరూ అతనిని సముదాయిస్తూ వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ బుడ్డోడు ఈ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ సినిమాలో ఎలాంటి ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయో అర్థమవుతుంది. మొత్తానికి ఈ బుడ్డోడుకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.