Sreemukhi: ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు మంచి గుర్తింపు సంపాదించుకుని వెండితెరపై వారి సత్తా చాటుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది యాంకర్స్ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు.ఈమె కెరీర్ మొదట్లో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాత ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ కార్యక్రమ వేదిక పైకి వచ్చి సందడి చేశారు.ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీముఖి ఏకంగా బోనికపూర్ ని తనకు వారి సినిమాల్లో అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే శ్రీముఖి అడిగిన ప్రశ్నకు బోనికపూర్ ఫన్నీ సమాధానమిచ్చారు.నేను సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా నీకు హీరోయిన్ అవకాశం ఇస్తానని బోనికపూర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
