Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hemachandra Sravana Bhargavi : విడాకుల వార్తలపై హేమచంద్ర-శ్రావణ భార్గవి రియాక్షన్.. అయితే నిజమేనా?

Star Singers Hemachandra And Sravana Bhargavi Reacts on Divorce Rumors via Instagram post

Star Singers Hemachandra And Sravana Bhargavi Reacts on Divorce Rumors via Instagram post

Hemachandra Sravana Bhargavi : సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సింగర్స్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నిరోజులుగా ఏ సోషల్ ప్లాట్ ఫాం చూసినా ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని, ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఇప్పటివరకూ హేమచంద్ర, శ్రావణ భార్గవి వీరిలో ఎవరూ కూడా ఈ వార్తలను ఖండించలేదు. దాంతో అనుమానాలు మరింత బలపడి.. వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

Star Singers Hemachandra And Sravana Bhargavi Reacts on Divorce Rumors via Instagram post

స్టార్ సింగర్ కపుల్స్ ఇద్దరూ మౌనం వహించడంతో ఈ ప్రచారం మరింత జోరుగా కొనసాగుతోంది. శ్రావణ భార్గవి తన సోషల్ అకౌంట్లను బ్లాక్ చేసిందని, కామెంట్లు, పోస్టులు కూడా పెట్టడం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ మౌనం వహించిన వీరిద్దరూ ఎట్టకేలకు విడాకులు వార్తలపై ఒకేసారి రియాక్ట్ అయ్యారు. శ్రావణ భార్గవి, హేమచంద్ర సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.

శ్రావణ భార్గవి పోస్ట్ చూస్తే.. తమ విడాకుల వార్తలు వైరల్ అవుతున్నప్పటినుంచి తన యూట్యూబ్ వ్యూస్ బాగా పెరిగాపోయాయట.. అంతేకాదు.. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగిపోయారట.. తాను ఎప్పుడూ చేసే వర్క్ కన్నా ఎక్కువ వర్క్ ఉంటోందని, సంపాదన కూడా ఈ వార్తల కారణంగా బాగా పెరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే.. వార్తల మాట ఎలా ఉన్నా.. ఇది ఒక శుభ పరిణామమే అంటోంది. అది తప్పో లేదా ఒప్పో కానీ.. మీడియా ఆశీర్వాదమంటూనే.. ఇది నా రాండం థాట్ అంటూ శ్రావణ భార్గవి షేర్ చేసింది. ఆ పోస్టుకు హేమచంద్రను ట్యాగ్ చేసేసింది.

Advertisement

మరోవైపు.. హేమచంద్ర కూడా తన ఇన్ స్టా అకౌంట్లో విడాకుల రుమర్లపై గట్టిగానే ఇచ్చిపడేశాడు. తాను పెట్టిన పోస్టును రివర్స్‌లో ఉంచాడు. తన పర్సనల్ లైఫ్ గురించి తమ సమయాన్ని వేస్ట్ చేసుకోవాలని భావిస్తున్నారో.. అలాగే తమ స్టుపిడ్ అంతా బయపెట్టేయాలని అనుకుంటున్నారో వారందరికి కోసమే ఈ పోస్టు అని రాసుకొచ్చారు. తమకు అవసరం లేని అసలే సంబంధంలేని సమాచారం.. తన సోలోగా పాడిన పాటల కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టా బయోలో ఇండిపెండెంట్ సాంగ్ లవ్ ఉంది.. అది కూడా చూసేయండి అని హేమచంద్ర తెలిపాడు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

హేమచంద్ర, శ్రావణభార్గవి ఎక్కడా కూడా తమ విడాకుల వార్తలపై నేరుగా ఖండించలేదు. అంటే.. వీరిద్దరి పోస్టుల వెనుక దాగి ఉన్న అర్థం.. ఈ వార్తలన్నీ నిజమేనా? అనే సందేహం రాకమానదు. శ్రావణి భార్గవి పోస్టులకు కామెంట్లు డిసేబుల్ కాగా.. హేమచంద్ర పోస్టులకు మాత్రం కామెంట్లు వస్తున్నాయి. ఏదిఏమైనా వీరిద్దరూ నేరుగా వార్తలను ఖండించకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ.. ఇదంతా గమనిస్తున్నా నెటిజన్లు మాత్రం అది నిజమే అయి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు హేమచంద్ర, శ్రావణభార్గవి నేరుగా స్పందిస్తారో లేదో చూడాలి.

Read Also : Hemachandra -Sravana Bhargavi : ఆ స్టార్ సింగర్ వల్ల శ్రావణ భార్గవి, హేమచంద్ర విడాకులు తీసుకుంటున్నారా..?

Advertisement
Exit mobile version