Sree Reddy: కరాటే కళ్యాణి గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకోవడం వల్ల ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆమె అతనిపై దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా పరస్పరం ఒకరినొకరు కొట్టుకోవడంతో గాయాలపాలై చివరికి ఇద్దరూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కొనసాగుతున్నటువంటి ఎంతోమంది హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై హీరోలు చేతులు వేస్తున్నారు. మరి అలాంటప్పుడు వారిని కూడా నువ్వు ఇలాగే ప్రశ్నిస్తావా? ఇలా తమ టాలెంట్ తో యూట్యూబ్ ని నమ్ముకొని బ్రతికే వారిపై ఈ విధంగా దాడి చేయడానికి రావడం మహిళలకే అగౌరవం అంటూ శ్రీ రెడ్డి యూట్యూబ్ స్టార్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
