SP Charan: ఎస్పీ చరణ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా ఆయన అందరికీ సుపరిచితమే.ఈయన గాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇకపోతే ఎస్పీ చరణ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో ఎన్నో వార్తలకు ఆజ్యం పోసిందని చెప్పాలి. ఈయన హీరోయిన్ సోనియా అగర్వాల్ తో ఫోటో దిగడమే కాకుండా తన భుజాలపై చేయి వేసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొత్త ప్రయత్నం అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో అనుమానాలకు దారితీసింది.
ఈ క్రమంలోనే నటి సోనియా అగర్వాల్ తో మాత్రమే కాకుండా ఈ ఫోటోలో అంజలి,సంతోష్ ప్రతాప్ కూడా ఉన్నారు. అయితే చరణ్ వీరిద్దరు ఉన్న ఫోటోని కట్ చేసి పోస్ట్ చేశారు. ఇలా వీరిద్దరి ఫోటో షేర్ చేయడంతో పెద్దఎత్తున ఈ ఫోటో వివాదాలకు కారణం కావడంతో తిరిగి ఈయన నలుగురు ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఫిల్మ్ ప్రొడక్షన్, ఇండియన్ వెబ్ సిరీస్ అనే హ్యాష్ టాగ్‌లు పెట్టడంతో అసలు విషయం అందరికీ అర్థమైంది. త్వరలోనే వీరందరూ కలిసి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నారని క్లారిటీ రావడంతో చరణ్ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది.
