Hyper Aadi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వారిలో హైపర్ ఆది కూడ ఒకరు. మొదట అదిరే అభి టీమ్ లో కంటెస్టెంట్ గా చేసిన ఆది అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో టీం లీడర్ గా ఎదిగాడు. ఆది వచ్చిన తర్వాత జబర్థస్త్ షో మరింత పాపులర్ అయ్యింది అనటంతో లో సందేహం లేదు. ప్రతి గురువారం ప్రసరమయ్యే జబర్థస్త్ లో ఆది తన పంచ్ లతో అందరిని కడుపుబ్బ నవ్విస్తు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇటీవల ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీ షో సందడి చేశాడు. ఈ స్కిట్ లో కొత్త పెళ్లికొడుకు అవతారం ఎత్తిన ఆదికి అమ్మాయి తల్లితండ్రులు జబర్థస్త్ లో స్కిట్ చేస్తేనే అమ్మాయిని పంపిస్తాం అని షరతు పెట్టారు. అంతటితో ఆగకుండా ఒక సీనియర్ నటి వచ్చి మా అల్లుడు మల్లెపూలు పెట్టుకుని, తెల్ల బట్టలు వేసుకొని వస్తె తీర వీడి పెళ్లాం లేచిపోయింది’ అంటూ ఆది పరువు తీసేసింది. తర్వత ఆదిని తొక్కి భయపడకు నీకు ఏమి కాదు. అయినా నీకూ ఏమైనా ఉంటేనే కదా అవ్వటానికి అనిగాలి తీసింది. దీంతో ఆది తాను కట్టుకున్న లుంగీ స్టేజ్ మీదే విప్పేసాడు. రామ్ ప్రసాద్ వచ్చి కట్టే ప్రయత్నం చేసినా కూడా ఆమె మళ్లీ వచ్చి లుంగీ ఆది తల మీద వేసింది. ఈ ఎపిసోడ్ కి సంబంధిచిన ప్రోమో ఇటీవల విడుదలైంది.
