G
Telugu News » Entertainment » sarkary vaari paata actress keerthy suresh shares some adorabel pics of her dog
⚡ Entertainment, Latest

Keerthy suresh: తెగ సంబరపడిపోతున్న మహానటి.. తన డాగ్ కు ఆ అనుభవం ఇదే తొలిసారట

Keerthy suresh: మహానటి సినిమాతో తన ప్రతిభను చాటి చెప్పింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటన చాలా మందిని ఆకట్టుకుంది. సినీ పెద్దలతో పాటు చాలా మంది ఆమె నటనకు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Keerthy suresh: మహానటి సినిమాతో తన ప్రతిభను చాటి చెప్పింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటన చాలా మందిని ఆకట్టుకుంది. సినీ పెద్దలతో పాటు చాలా మంది ఆమె నటనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఇటీవలె మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ నటించి మెప్పించింది కీర్తి సురేష్. తాజాగా సోషల్ మీడియాలో కీర్తి తన సంబరాన్ని పంచుకుంది. అయితే అది సినిమాకు సంబంధించింది ఏమాత్రం కాదు. తన కుక్క పిల్లతో కొన్ని పిక్స్ పోస్టు చేసి మురిసిపోయింది ఈ మహానటి.

 

Advertisement

తన పెట్ డాగ్ తొలిసారి విమాన ప్రయాణం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసి తెగ మురిసిపోయింది. చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలోని తన అకౌంట్ లో షేర్ చేసింది ఈ భామ.
ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తోంది. భోళా శంకర్ అనే సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది మూవీ టీం. ఈ సినిమానే కాకుండా మరో తెలుగు రీమేక్ సినిమాలో బాలీవుడ్ లో నటిస్తోంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷keerthikeerthi suresh actressKeerthy Sureshmahaanati
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు